DSC 2024: జిల్లా వ్యాప్తంగా 323 ఉపాధ్యాయ ఖాళీలు..
జిల్లా వ్యాప్తంగా 323 ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు నోటిఫికేషన్ విడుదల చేయగా అప్పట్లో 275 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఫిబ్రవరిలో డీఎస్సీ నిర్వహించాల్సి ఉండగా, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరిన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది.
చదవండి: TREIRB TGT Result 2024: టీజీటీ ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల
మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 11వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అప్పటి నోటిఫికేషన్ కంటే రాష్ట్రవ్యాప్తంగా 5,086 పోస్టులు అధికంగా ఉండనున్నాయి. అలాగే జిల్లాలో 48 పోస్టులు పెరగనున్నాయి. అయితే గత డీఎస్సీ కోసం జిల్లాలో 10వేల మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అదనంగా మరో 2వేల మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విద్యాశాఖ సమావేశం..
ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులతో ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో ఆ శాఖ ఉన్నతాధికారులు సమావే శం నిర్వహించారు. జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సేకరించారు. వాటిని భర్తీ చేసే లా నోటిఫికేషన్ జారీకి కసరత్తు చేస్తున్నట్లు తెలు స్తోంది.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా స్థాయిలోనూ రోస్టర్, కేటగిరీ వారీగా పోస్టులతో కూడిన నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఈనెలాఖరు, మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ రానుందనే సమాచా రంతో విద్యాశాఖ సమాయత్తమవుతోంది. తాజా నిర్ణయంతో ఆ పోస్టుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతుంది. కాగా, గత ప్రభుత్వం జిల్లాలో డీఎస్సీ ద్వారా 275 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో 54 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 206 ఎస్జీటీ, 13 భాషా పండిత్, 2 పీఈటీ పోస్టులు ఉన్నాయి.
ఖాళీలను గుర్తించాం..
మెగా డీఎస్సీకి సంబంధించిన సమావేశం హైదరా బాద్‌లో ఉన్నతాధికారులతో ఫిబ్రవరి 24న జరిగింది. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాల ు అందజేయాలని ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు ఖాళీల వివరాలను గుర్తించాం. త్వరలోనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, కార్యదర్శికి పూర్తి వివరాలు సమర్పిస్తాం.
– ప్రణీత, డీఈవో