TREIRB TGT Result 2024: టీజీటీ ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల
![Release of TGT Preliminary Selection List](/sites/default/files/images/2024/02/26/yvu-results-1708931838.jpg)
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల విద్యా సంస్థల్లో 4,020 ఉద్యోగ ఖాళీలకు గతేడాది నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టులో పరీక్షలు నిర్వహించిన బోర్డు.. ఫైనల్ కీలను విడుదల చేసింది. తాజాగా 1:2 నిష్పత్తిలో ఎంపిక జాబితాను విడుదల చేసింది.
Gurukulam Teachers Results 2024 | TREI-RB TGT Certificate Verification List out
ఫిబ్రవరి 27, 28 తేదీల్లో అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనుంది. ఫిబ్రవరి 27న ఇంగ్లిష్, బయోసైన్స్, జనరల్ సైన్స్, సోషల్, తెలుగు సబ్జెక్టులకు, ఈనెల 28న మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, హిందీ, ఉర్దూ, సంస్కృతం సబ్జెక్టుల అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించనుంది. ఈ మేరకు సబ్జెక్టుల వారీగా పూర్తిస్థాయి షెడ్యూల్‌ను బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
చదవండి Good News.. APPSC Jobs Increase 2024 : భారీగా పెరిగిన ఏపీపీఎస్సీ ఉద్యోగాలు.. అలాగే ఈ పోస్టులు కూడా..
జేఎల్, డీఎల్ జాబితా విడుదలలో జాప్యం
జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించిన తుది జాబితాను ఫిబ్రవరి 25న సాయంత్రం విడుదల చేయాల్సి ఉండగా.. మెడికల్ బోర్డుకు సంబంధించి పరిశీలన ప్రక్రియ పూర్తి కాకపోవడంతో జాప్యం జరిగినట్లు సమాచారం. నేడో, రేపో తుది జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.