Skip to main content

Good News.. APPSC Jobs Increase 2024 : భారీగా పెరిగిన ఏపీపీఎస్సీ ఉద్యోగాలు.. అలాగే ఈ పోస్టులు కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వ‌హించే వివిధ ఉద్యోగాల సంఖ్య క్ర‌మంగా పెంచుతూ వ‌స్తుంది. ఏపీపీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
APPSC Recruitment 2024     APPSC Degree Lecturer Notification   Apply for Degree Lecturer Positions   Notification for College Lecturer Posts   APPSC Jobs Increase 2024 Details in Telugu    Government Jobs Announcement

మొదట వెలువడిన నోటిఫికేషన్ లో 240 పోస్టులు మాత్రమే ఉండగా.. తాజాగా మరో 50 పోస్టులను పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 290కి చేరింది. ఈ ఉద్యోగాల‌కు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు ప్రక్రియ జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు కలదు. ఏప్రిల్/మే నెలల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

గ్రూప్‌–2 పోస్టుల సంఖ్య 1000కి పైగా పెరిగే అవ‌కాశం ..

appsc job increased news telugu

ప్రస్తుతం ప్రకటించిన గ్రూప్-2 పోస్టులతో పాటు కొన్ని ప్రభుత్వ విభాగాల్లో మరిన్ని ఖాళీలు ఉన్నట్టు తేలింది. ఆ పోస్టులను సైతం ఈ నోటిఫికేషన్‌కు జత చేయనున్నారు. ఇదే జరిగితే మొత్తం గ్రూప్‌–2 పోస్టుల సంఖ్య 1000కి పైగా చేరే అవకాశం ఉంది. ముందే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి 25వ తేదీన‌ నిర్వహించేందుకు కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది.ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) ఇచ్చిన 899 గ్రూప్‌–2 పోస్టులకు మొత్తం 4,83,525 దరఖాస్తులు వచ్చినట్టు సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. గతనెలలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో తొలుత 897 పోస్టులను ప్రకటించగా, అదనంగా మరో రెండు పోస్టులు కలిపి మొత్తం 899 పోస్టులు ఉన్నట్లు తేలింది.

Published date : 25 Jan 2024 08:40AM

Photo Stories