‘డీఎస్సీ క్వాలిఫైడ్’ జాబితా ఇదే.. చూడండి
Minimum Time Scale (MTS) టీచర్లుగా చేరేందుకు ఆసక్తిగల DSC–1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు సీఎస్‌ఈ వెబ్‌సైట్ ద్వారా అంగీకారం తెలిపే అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే కొందరు అభ్యర్థులకు 1998 నాటి తమ డీఎస్సీ హాల్ టికెట్ నంబర్ తెలియని కారణంగా అంగీకా రాన్ని తెలపలేకపోతున్నారు. ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య కమిషనర్ సురేష్‌కుమార్‌కి ఏపీటీఎఫ్ విజ్ఞప్తి చేసింది. దీంతో డీఎస్సీ–1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల జాబితా మొత్తాన్ని ‘http://sims.ap.gov.in/DSC/login’ పోర్టల్‌లో పొందుపరిచారు. దీని ద్వారా 1998 డీఎస్సీ అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్ తెలుసుకొని తమ ఆప్షన్ తెలియజేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి తెలిపారు. ఆగస్టు 5న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా స్కూళ్ల వారీగా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించుకోవచ్చని ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ప్రకటించినా డీఈవోలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఏపీటీఎఫ్ నేతలు పేర్కొన్నారు.
#Tags