Indian Railway Recruitment Board : భారత రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహణ

రైల్వేలో ఉద్యోగాలంటే ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్‌ అర్హతతో భర్తీ చేసే అసిస్టెంట్‌ లోకో పైలట్, టెక్నిషియన్‌ వంటి టెక్నికల్‌ కొలువులే గుర్తొస్తాయి. కాని నాన్‌ టెక్నికల్‌ విభాగాల్లోనూ ఎన్నో ఉద్యోగాలను రైల్వే శాఖ భర్తీ చేస్తోంది.

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌.. సంక్షిప్తంగా ఆర్‌ఆర్‌బీ! ప్రభుత్వ ఉద్యోగార్థులు ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎలాగైనా రైల్వే కొలువు దక్కించుకోవాలని ఎంతోకాలంగా ప్రిపరేషన్‌ సాగిస్తుంటారు. అలాంటి వారికోసం కొలువుల రైల్‌ కూత పెట్టేసింది! నాన్‌–టెక్నికల్‌ విభాగంలో 11,558 పోస్ట్‌ల భర్తీకి భారతీయ రైల్వే శాఖ ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (నాన్‌–టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఆర్‌ఆర్‌బీ తాజా నోటిఫికేషన్‌ వివరాలు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, ప్రిపరేషన్‌ తదితర సమాచారం..  

నాన్‌–టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌
రైల్వేలో ఉద్యోగాలంటే ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్‌ అర్హతతో భర్తీ చేసే అసిస్టెంట్‌ లోకో పైలట్, టెక్నిషియన్‌ వంటి టెక్నికల్‌ కొలువులే గుర్తొస్తాయి. కాని నాన్‌ టెక్నికల్‌ విభాగాల్లోనూ ఎన్నో ఉద్యోగాలను రైల్వే శాఖ భర్తీ చేస్తోంది. ఇందుకోసం నాన్‌–టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ(ఎన్‌టీపీసీ) పేరుతో ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తోంది.
మొత్తం పోస్టులు 11,558
     ఆర్‌ఆర్‌బీ తాజా నోటిఫికేషన్‌ ప్రకారం–గ్రాడ్యుయేట్‌ పోస్ట్‌లు, అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్ట్‌ల పేరుతో రెండు స్థాయిలలో ఖాళీలను ప్రకటించారు. గ్రాడ్యుయేట్, అండర్‌ గ్రాడ్యుయేట్‌ విభాగాలు రెండూ కలిపి మొత్తం 11,538 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.
     గ్రాడ్యుయేట్‌ పోస్టుల వివరాలు: చీఫ్‌ కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ సూపర్‌వైజర్‌ 1,736 పోస్టులు, స్టేషన్‌ మాస్టర్‌ 994, గూడ్స్‌ ట్రైన్‌ మేనేజర్‌ 3,144, జూనియర్‌ అకౌంట్స్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ 1,507, సీనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ 732 పోస్టులు ఉన్నాయి. 
     అండర్‌–గ్రాడ్యుయేట్‌ లెవల్‌ పోస్ట్‌లు: కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ క్లర్క్‌ 2,022 పోస్టులు, అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ 361 పోస్టులు, జూనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ 990 పోస్టులు, ట్రైన్స్‌ క్లర్క్‌ 72 పోస్టులు న్నాయి.
అర్హతలు
     గ్రాడ్యుయేట్‌ పోస్ట్‌లకు 2024, అక్టోబర్‌ 13 నాటికి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 
     అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్ట్‌లకు 2024, అక్టోబర్‌ 20 నాటికి ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు
     గ్రాడ్యుయేట్‌ పోస్ట్‌లకు 2025, జనవరి 1 నాటికి 18–36 ఏళ్లు ఉండాలి.
     అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్ట్‌లకు 2025, జనవరి 1 నాటికి 18–33 ఏళ్లు ఉండాలి. 
మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ
మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌–1, కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌–2, స్కిల్‌ టెస్ట్, టైపింగ్‌ టెస్ట్, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లకు హాజరవ్వాల్సి ఉంటుంది.సీబీటీ– 1,సీబీటీ–2లు అన్ని పోస్ట్‌లకు తప్పనిసరి కాగా, మి­గిలిన టెస్ట్‌లు ఆయా పోస్ట్‌లను బట్టి నిర్వహిస్తారు.
Overseas Scholarship: విదేశీ విద్యకు ప్రోత్సాహం.. అర్హతలు, కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు ఇవే..
కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌–1
ఎంపిక ప్రక్రియలో తొలిదశ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ను మూడు విభాగాల్లో 100 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్‌ అవేర్‌నెస్‌ (40 ప్రశ్నలు), మ్యాథమెటిక్స్‌ (30 ప్రశ్నలు), జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ (30 ప్రశ్నలు) నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష వ్యవధి గంటన్నర. ప్రతి తప్పు సమాధానానికి 1/3వంతు మార్కు తగ్గిస్తారు.
కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌–2
కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌–1లో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు 15 మందిని చొప్పున ఎంపిక చేసి.. రెండో దశ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌–2కు ఎంపిక చేస్తారు. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌ (50 ప్రశ్నలు), మ్యాథమెటిక్స్‌ (35 ప్రశ్నలు), జనరల్‌ ఇంటెలిజెన్స్‌ (35 ప్రశ్నలు) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 120 మార్కులకు సీబీటీ–2 ఉంటుంది. పరీక్ష వ్యవధి గంటన్నర. ప్రతి తప్పు సమాధానానికి 1/3వంతు నెగెటివ్‌ మార్క్‌ నిబంధన ఉంటుంది.
కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌
ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియలో మరో దశ కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (సీబీఏటీ). స్టేషన్‌ మాస్టర్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు మాత్రమే దీన్ని నిర్వహిస్తారు. సీబీటీ–1, సీబీటీ–2లలో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు 8 మందిని చొప్పున సీబీఏటీకి ఎంపిక చేస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో అభ్యర్థుల్లో నిర్ణయాత్మక సామర్థ్యం, సమయస్ఫూర్తిని పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌కు 30 మార్కుల వెయిటేజీ; మిగతా 70 మార్కుల వెయిటేజీ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌లో పొందిన మార్కలకు ఉంటుంది.
Job Mela: గుడ్‌న్యూస్‌.. జాబ్‌మేళా, నెలకు రూ. 25వేల వేతనం
కొన్ని పోస్ట్‌లకు టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌
ఆర్‌ఆర్‌బీ నాన్‌–టెక్నికల్‌ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియ­లో భాగంగా కొన్ని పోస్ట్‌లకు టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారు. గ్రాడ్యుయేట్‌ పోస్ట్‌లలో సీనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్ట్‌లకు; అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్ట్‌లో అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్, జూనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌లో భాగంగా ఇంగ్లిష్‌లో నిమిషానికి 30 పదాలు, హిందీలో నిమిషానికి 25 పదాలు చొప్పున కంప్యూటర్‌లో టైప్‌ చేయాల్సి ఉంటుంది.
రాత పరీక్షలో రాణించే మార్గం
అన్ని పోస్ట్‌లకు ఉమ్మడిగా నిర్వహించే కంప్యూట­ర్‌ బేస్డ్‌ టెస్ట్‌–1, టెస్ట్‌–2లలో రాణించేందుకు అభ్యర్థులు విభాగాల వారీగా ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. 
జనరల్‌ అవేర్‌నెస్‌
ఈ విభాగంలో చరిత్ర, జాగ్రఫీ, సివిక్స్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు సోషల్‌ పాఠ్య పుస్తకాలను ఔపోసన పట్టాలి. ముఖ్యమైన తేదీలు, ఘట్టాలు, వ్యక్తులు, రికార్డులు, యుద్ధాలు, సహజ వనరులు, సరిహద్దులు, నదులు, సముద్రాలు, పర్వతాలపై అవగాహన పెంచుకోవాలి. సివిక్స్‌కు సంబంధించి రాజ్యాంగం గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి. జనరల్‌ సైన్స్‌లో వ్యాధులు, వ్యాక్సీన్లు, విటమిన్లు, మోడ్రన్‌ ఫిజిక్స్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాలి.
మ్యాథమెటిక్స్‌
ఈ విభాగంలో శాతాలు, లాభ–నష్టాలు, టైం అండ్‌ డిస్టెన్స్, టైం అండ్‌ వర్క్, మెన్సురేషన్, పర్ముటేషన్‌–కాంబినేషన్, నిష్పత్తులు–విలువలు ముఖ్యమైనవి. హై స్కూల్‌ స్థాయి గణిత పాఠ్య పుస్తకాల అధ్యయనంతోపాటు పై చార్ట్స్, బార్‌ గ్రాఫ్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి.
Anganwadi Jobs: అంగన్‌వాడీలో టీచర్‌, ఆయా పోస్టులు ఖాళీ
జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌
నంబర్‌ సిరీస్, కోడింగ్‌–డీకోడింగ్, బ్లడ్‌ రిలేషన్స్, క్లాసిఫికేషన్, డైరెక్షన్, క్యాలెండర్, క్లాక్, బాడ్‌మాస్‌పై పట్టు సాధించాలి. ఆల్ఫాబెటికల్‌ ఆర్డర్స్, 1 నుంచి 25 వరకు మ్యాథమెటికల్‌ టేబుల్స్‌పై అవగాహన పొందాలి.
ప్రీవియస్‌ పేపర్స్‌
ప్రిపరేషన్‌లో భాగంగా అభ్యర్థులు గత ప్రశ్న పత్రాలను సాధన చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ఫలితంగా ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీ, ప్రశ్నలు అడుగుతున్న తీరు, ప్రశ్నల క్లిష్టత స్థాయి వంటి వాటిపై అవగాహన పొందొచ్చు. 
ముఖ్య సమాచారం
     దరఖాస్తు విధానం: దేశ వ్యాప్తంగా ఉన్న 21 ఆర్‌ఆర్‌బీల్లో ఖాళీలున్న నేపథ్యంలో అభ్యర్థులు ఏదో ఒక ఆర్‌ఆర్‌బీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి.. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ లింక్‌ మీద క్లిక్‌ చేసి తమ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్‌ అభ్యర్థులు www.rrbsecuderabab.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ లింక్‌ మీద క్లిక్‌ చేయాలి.
     ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: గ్రాడ్యుయేట్‌ పోస్ట్‌లకు 2024, అక్టోబర్‌ 13; అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్ట్‌లకు 2024, అక్టోబర్‌ 20. 
     పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.rrbsecunderabad.gov.in

Non Executive Posts : ముంబాయిలో కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న నాన్ ఎగ్జిగ్యూటివ్ పోస్టులు..

#Tags