Group B and C Posts : ఇండియన్‌ నేవీలో గ్రూప్‌ బి, గ్రూప్‌ సి పోస్టులు.. వివ‌రాలు ఇలా..

ఇండియన్‌ నేవీలో గ్రూప్‌ బి, గ్రూప్‌ సి పోస్టుల భర్తీకి సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఐఎన్‌సీఈటీ–01/2024) నిర్వహిస్తారు.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 741.
»    పోస్టుల వివరాలు: గ్రూప్‌ బి పోస్టులు: ఛార్జ్‌మ్యాన్‌(అమ్యూనిషన్‌ వర్క్‌షాప్‌)–01, చార్జ్‌మ్యాన్‌(ఫ్యాక్టరీ)–10, ఛార్జ్‌మ్యాన్‌(మెకానిక్‌)–18, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌–04.
»    గ్రూప్‌ సీ పోస్టులు: డ్రాఫ్ట్స్‌మ్యాన్‌(కన్‌స్ట్రక్షన్‌)–02, ఫైర్‌మ్యాన్‌–444, ఫైర్‌ ఇంజన్‌ డ్రైవర్‌–58, ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌–161, పెస్ట్‌ కంట్రోల్‌ వర్కర్‌–18, కుక్‌–09, ఎంటీఎస్‌(మినిస్టీరియల్‌)–16.
»    అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: ఛార్జ్‌మ్యాన్‌(మెకానిక్‌), సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. ఫైర్‌మ్యాన్, ఫైర్‌ ఇంజన్‌ డ్రైవర్‌ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. మిగిలిన పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.08.2024
»    వెబ్‌సైట్‌: https://incet.cbtexam.in

RBI Recruitment 2024 : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 94 ఆఫీసర్‌ గ్రేడ్‌–బి పోస్టులు..

#Tags