Skip to main content

Jobs for Ex Army : సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలకు దరఖాస్తులు.. వీరే అర్హులు..

Security guard vacancies in SBI banks for ex-servicemen   Security jobs for Ex Army man at SBI Bank Tirupati  Ex-servicemen security guard jobs announcement

చిత్తూరు: తిరుపతి జిల్లాలోని ఎస్‌బీఐ బ్యాంకుల్లో సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి ఉన్న మాజీ సైనికులు దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి విజయశంకర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఎస్‌బీఐ బ్యాంకులలో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలకు మాజీ సైనికులు అర్హులన్నారు. కాలపరిమితి ఒక సంవత్సరం ఉంటుందని తెలిపారు. 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య గల మాజీ సైనికులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. జీతం దాదాపు రూ.26 వేల వరకు ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న మాజీ సైనికులు దరఖాస్తులను చిత్తూరు జిల్లా కేంద్రంలోని సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈ నెల 16 వ తేదీలోపు అందజేయాలని కోరారు.

Intermediate Marks : ఇంట‌ర్ మార్కులు అందుబాటులో.. అనుమ‌తిప‌త్రం త‌ప్ప‌నిస‌రి!

Published date : 12 Jul 2024 01:29PM

Photo Stories