Skip to main content

BSF Direct Recruitment: బీఎస్‌ఎఫ్‌లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

బీఎస్‌ఎఫ్‌లో ల‌భించే ప‌లు పోస్టుల వివ‌రాలు ఇలా..
Assistant Sub Inspector in BSF  Applications for various posts in BSF on direct recruitment basis  BSF Recruitment Notification 2024

సాక్షి ఎడ్యుకేష‌న్‌:
బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, హెడ్‌ కానిస్టేబుల్, వారెంట్‌ ఆఫీసర్, హవల్దార్‌(క్లర్క్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అస్సాం రైఫిల్‌ ఎగ్జామినేషన్‌–2024 ద్వా­రా ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హులైన పురుష/మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
»    మొత్తం పోస్టుల సంఖ్య: 1,526.
పోస్టుల వివరాలు
»    హెడ్‌ కానిస్టేబుల్‌(హెచ్‌సీ) (మినిస్టీరియల్‌/కంబాటెంట్‌ మినిస్టీరియల్‌), హవల్దార్‌(క్లర్క్‌)–1283.
»    అసిస్టెంట్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌(ఏఎస్సై)–(స్టెనోగ్రాఫర్‌/కంబాటెంట్‌ స్టెనోగ్రాఫర్‌), వారెంట్‌ ఆఫీసర్‌(పర్సనల్‌ అసిస్టెంట్‌)–243.
»    అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి ఉత్తీర్ణులవ్వాలి. టైపింగ్,స్టెనోగ్రఫీ సర్టిఫికేట్, నిర్దిష్ట శారీరక/వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 09.06.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.07.2024
»    వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in

Hyderabad University Ph D Courses: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు..

Published date : 12 Jun 2024 01:53PM

Photo Stories