Summer Holidays: పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు.. ఎప్పటి వరకు..?

ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం, వారి పరీక్ష పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. అయితే, పాఠశాల విద్య కమిషనర్‌ విద్యార్థులకు సెలవుల శుభవార్తను ప్రకటించి, ఎప్పటివరకు ఉంటాయో వెల్లడించారు. దీంతోపాటు 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు జరగనున్న వార్షిక పరీక్షల గురించి తెలుపుతూ ఆ షెడ్యూల్ని విడుదల చేశారు..

అనంతపురం: 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 24 నుంచి జూన్‌ 11 వరకూ అన్ని యాజమాన్యాల పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌కుమార్‌ మంగళవారం విడుదల చేశారు. జూన్‌ 12న పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి.

Jobs With Huge Salary: ఉద్యోగాల భర్తీ..నెలకు లక్షన్నరకు పైగా జీతం, ఎక్కడో తెలుసా?

ఇప్పటికే పదో తరగతి వార్షిక పరీక్షలు పూర్తయి పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఇక 1–9 తరగతుల విద్యార్థులకు ఈనెల 6 నుంచి 18 వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. 19 నుంచి 21లోపు ఆయా పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. చివరి రోజున ప్రోగ్రెస్‌ కార్డులు విద్యార్థులకు అందజేయనున్నారు.

Donald Trump: రూ.1,460 కోట్ల బాండ్‌ సమర్పించిన ట్రంప్.. దేనికంటే..

పరీక్షల షెడ్యూలు ఇలా...

6వ తేదీ 1–9 తరగతులకు మొదటి లాంగ్వేజ్‌, 8వ తేదీ 1–5 తరగతులకు ఇంగ్లిష్‌ పార్ట్‌–ఏ, 6 నుంచి 9 తరగతులకు సెకండ్‌ లాంగ్వేజ్‌, 10వ తేదీ 1–5 తరగతులకు ఇంగ్లిష్‌ పార్ట్‌–బీ (టోఫెల్‌), 6 నుంచి 9 తరగతులకు ఇంగ్లిష్‌ పార్ట్‌–ఏ, 12వ తేదీ 1–5 తరగతులకు గణితం, 6–9 తరగతులకు ఇంగ్లిష్‌ పార్ట్‌–బీ (టోఫెల్‌), 13వ తేదీ 3–5 తరగతులకు ఈవీఎస్‌, 6–9 తరగతులకు గణితం, 15వ తేదీ 3–5 తరగతులకు ఓఎస్‌ఎస్సీ, 6 నుంచి9 తరగతులకు ఫిజికల్‌ సైన్స్‌, 16వ తేదీ 4వ తరగతి విద్యార్థులకు (ఎంపిక చేసిన స్కూళ్లు) స్లాస్‌–2024 పరీక్ష, 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు బయాలజికల్‌ సైన్స్‌, 18న సోషల్‌ పరీక్ష ఉంటుంది. 1–8 తరగతుల విద్యార్థులకు రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు 9 నుంచి 12.15 గంటల వరకు పరీక్ష సమయం కేటాయించారు.

IIT Hyderabad Notification 2024: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు, ఎవరెవరు అప్లై చేయొచ్చంటే..

#Tags