Summative Assessment-2: నేడు సమ్మెటివ్‌ అసెస్మెంట్‌-2 పరీక్షలు ప్రారంభం.. షెడ్యూల్‌ ఇలా..

నేడు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్‌ అసెస్మెంట్‌-2 ప్రారంభం. అయితే, విద్యార్థులకు నిర్వహించనున్న ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌లో ఉండే పరీక్షల తేదీలు తదితర వివరాలను వివరించారు అధికారులు..

కంకిపాడు: సంగ్రహణాత్మక మదింపు–2 (సమ్మెటివ్‌–2) పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ, జిల్లా పరీక్షల విభాగం సమాయత్తమైంది. ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకూ విద్యనభ్యసించే విద్యార్థులకు ఎస్‌సీఈఆర్‌టీ–ఏపీ రూపొందించిన ప్రశ్నపత్రాలతో సమ్మెటివ్‌–2 పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది.

6th To 10th Class Admissions: ఆదర్శ పాఠశాలల ప్రవేశానికి పరీక్ష

షెడ్యూల్‌ ఇలా..

కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఈనెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ, ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకూ విద్యార్థులకు 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకూ విద్యార్థులకు క్లాస్‌ రూమ్‌ బేస్డ్‌ అసెస్మెంట్‌ (సీబీఏ) నిర్వహిస్తారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఎస్‌ఏ–2 పరీక్ష నిర్వహించనున్నారు.

Collector Ravi Naik: చదువుతోనే సమాజంలో గుర్తింపు

క్లాస్‌రూమ్‌ బేస్డ్‌అసెస్మెంట్‌కు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు ఒక ఓఎంఆర్‌, 6, 7, 8 తరగతులకు లాంగ్వేజ్‌ పరీక్షలకు ఒకటి, నాన్‌ లాంగ్వేజ్‌లకు మరో ఓఎంఆర్‌ను ఇస్తారు. అయితే ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కేవలం ప్రశ్నపత్రం మాత్రమే ఇస్తారు. జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం నుంచి ప్రశ్నపత్రాలను ఓఎంఆర్‌లను ప్రాథమిక పాఠశాలలకు స్కూల్‌ కాంప్లెక్స్‌లకు, 6 నుంచి 9వ తరగతి వరకూ విద్యార్థులకు ఎంఆర్‌సీ సెంటర్ల నుంచి ప్రశ్న పత్రాలను పంపే ఏర్పాట్లు చేశారు.

Most Powerful Laser: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లేజర్ ఇదే..

ఇప్పటికే ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్‌లు ఆయా కాంప్లెక్సులు, ఎంఆర్‌సీ సెంటర్లలో భద్రపరిచారు. పరీక్షలు సమర్థంగా నిర్వహించేలా, పరీక్ష రాసే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులకు సూచనలు అందించారు. మూల్యాంకనం పూర్తి చేసి 22వ తేదీన తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రగతిని తెలియజేయాలని, ప్రమోషన్‌ లిస్టులను ప్రదర్శించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

#Tags