Collector Ravi Naik: చదువుతోనే సమాజంలో గుర్తింపు
ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్‌రాం జయంతిని పురస్కరించుకొని తెలంగాణ చౌరస్తాలోని ఆయన విగ్రహం వద్ద ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రాం విగ్రహానికి కలెక్టర్ రవినాయక్, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సంఘ సంస్కర్తగా, బడుగు బలహీన వర్గాల కోసం బాబు జగ్జీవన్‌రాం ఎంతో కృషిచేశారన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించారన్నారు. సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కు ల కోసం అలుపెరగని పోరాటం కొనసాగించారని కొనియాడారు.
చదవండి: 6th To 10th Class Admissions: ఆదర్శ పాఠశాలల ప్రవేశానికి పరీక్ష
సమాజంలో అసమానతలు తొలగించేందుకు ఎందరో మహనీయులు తమ ప్రాణా లు పణంగా పెట్టి అహర్నిషలు కృషిచేశారని అభిప్రాయపడ్డారు. సమాజంలో మార్పు కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.
కలెక్టరేట్‌లో...
కలెక్టరేట్‌లో బాబు జగ్జీవన్‌రాం జయంతిని ఘనంగా నిర్వహించారు. సమావేశ మందిరంలో బాబుజగ్జీవన్‌రాం చిత్రపటాన్ని ఏర్పాటుచేసి అదనపు కలెక్టర్ మోహన్‌రావు పూలమాల వేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ నర్సింహులు, కలెక్టరేట్ ఏఓ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.
చదవండి: Law Education: న్యాయ విద్యలోరాణించేలా.. సంగారెడ్డి న్యాయ కళాశాల.. ఉచిత వసతి సౌకర్యం కుడా