Hostel Students: బాలికల హాస్టల్‌లో తనిఖీలు చేపట్టిన ఆర్డీఓ.. విద్యార్థుల ఆరోగ్యంపై ఆదేశాలు జారీ..!

హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల ఆరోగ్యంపై ఆరాతీసేందుకు అక్కడ తనిఖీలు చేపట్టారు ఆర్డీఓ శ్రీనివాస్‌రావు. అయితే, అక్కడ విద్యార్థులు ఉన్న పరిస్థితి తెలుసుకుని హాస్టల్‌ సిబ్బందికి ఆదేశాలను జారీ చేశారు..

తాండూరు రూరల్‌: వసతి గృహంలో విద్యార్థినుల అస్వస్థతపై కలెక్టర్‌ నారాయణరెడ్డి స్పందిచారు. వివిధ దినపత్రికల్లో వచ్చిన కథనాలపై విచారణ జరపాలని తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్‌రావును ఆయన ఆదేశించారు. ఈ మేరకు గురువారం మండలంలోని జినుగుర్తి గేటు వద్ద ఉన్న కేజీబీవీ పాఠశాలను ఆర్డీఓ పరిశీలించారు. హాస్టల్‌లో ఉన్న వంట, నీటి సరఫరా గదులను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థినీలతో మాట్లాడారు. హాస్టల్‌ వెనక భాగంలో అపరిశుభ్రత ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

AP Inter Reverification And Recounting : ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం

కేజీబీవీ ఎదుట ఉన్న జిప్సం ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుర్వాసనతో బాలికలు అస్వస్థతకు గురవుతున్న విషయంపై ఎందుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదని ప్రత్యేకాధికారిణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆర్డీఓ ప్రకటించారు. తర్వాత నిలోఫర్‌లో చికిత్స పొందుతున్న అలేఖ్య బంధువులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఈ నెల 28వ తేదీ నుంచి అలేఖ్య అనారోగ్యంతో బాధపడటంతో బంధువులు తీసుకెళ్లినట్లు ప్రత్యేకాధికారి తెలిపారు. ప్రస్తుతం ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని ఆర్టీఓ వివరించారు. విద్యార్థినీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని సూచించారు.

Tech Jobs: ఐటీ జాబ్‌ కోసం వేచిచూస్తున్న వారికి శుభవార్త.. పుంజుకోనున్న నియామకాలు!!

సెక్యూరిటీ సరిగ్గా లేదు

అనంతరం మండలంలోని చెన్‌గేస్‌పూర్‌ మార్గంలోని జ్యోతిరావుఫూలే బాలికల హాస్టల్‌ను ఆర్టీఓ శ్రీనివాస్‌రావు పరిశీలించారు. అనారోగ్యానికి గురైన విద్యార్థినీలు మౌనిక, సుమిత్రల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ప్రిన్సిపాల్‌ నాస్సీతో సమగ్ర వివరాలు సేకరించారు. పాఠశాలలో మొత్తం 508 మంది విద్యార్థులకు గాను.. ప్రస్తుతం 436 మంది విద్యార్థులు హాస్టల్‌లో ఉన్నారని తెలిపారు. విద్యార్థినీలను పిలిచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భోజనం ఎలా ఉందని అడిగారు.

AP Inter Supplementary Exam Dates Announced: ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిలయ్యారా? సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే..

అనంతరం పాఠశాలను సందర్శించి ప్రహరీ గోడ చిన్నగా ఉండడంతో సెక్యూరిటీకి ఇబ్బంది అవుతుందని ప్రిన్సిపాల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లో హాస్టల్‌ను సందర్శించాలని ఆర్‌ఐ బాల్‌రాజ్‌ను ఆదేశించారు. తనిఖీలపై పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని ఆర్డీఓ శ్రీనివాస్‌ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ విజయేందర్‌, అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా విద్యాశాఖ ఆదేశాల మేరకు జ్యోతిరావుఫూలే హాస్టల్‌, కేజీబీవీ పాఠశాలను ఎంఈఓ వెంకటయ్య పరిశీలించారు. ఈ మేరకు నివేదికను డీఈఓకు అందజేస్తామని ఆయన తెలిపారు.

College Fest: ఈ విషయాల్లో విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి..

#Tags