Skip to main content

AP Inter Supplementary Exam Dates Announced: ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిలయ్యారా? సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే..

AP Inter Supplementary Exam Dates Announced

ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తప్పిన అభ్యర్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశం ఉన్నందున విద్యార్థులు ఆందోళన చెందొద్దని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరబ్ గౌర్ అన్నారు.

ఈ మేరకు తల్లిదండ్రులు, కాలేజీ యాజమన్యాలు విద్యార్ధులకు అండగా నిలిచి మనోధైర్యం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష తేదీలను అధికారులు వెల్లడించారు.

సప్లిమెంటరీ పరీక్షలు..

మే 24 నుంచి జూన్‌1 వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. సప్లిమెంటరీ రాసే విద్యార్థులు ఫీజును ఈనెల 18 నుంచి 24 వరకు చెల్లించాలి. ఫలితాలపై సందేహాలున్న విద్యార్థులకు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు బోర్డు అవకాశం కల్పించింది. 


ముఖ్యమైన తేదీలు

  • సప్లిమెంటరీ థియరీ పరీక్షల తేదీలు: మే 25 నుంచి జూన్‌1 వరకు
  • పరీక్షా సమయం: రెండు సెషన్లలో;09:00AM నుండి 12:00 PM వరకు, 02:30 PM నుండి 05:30 PM వరకు
  • ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 24 వరకు 
  • ప్రాక్టికల్‌ పరీక్షలు: మే1 నుంచి మే 4 వరకు
Published date : 12 Apr 2024 03:08PM

Photo Stories