Skip to main content

AP Inter Reverification And Recounting : ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం

Recounting and Re Inter Board Clarification on Application Dates   verification Opportunity  AP Inter Reverification And Recounting   Andhra Pradesh Intermediate Results Announcement

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఈరోజు(శుక్రవారం)ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.

ఇంటర్మీడియట్‌లో 10.53 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్‌ 4వ తేదీకి పూర్తి అయ్యింది. రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. అయితే పరీక్షలు బాగా రాసినప్పటికీ మార్కులు తక్కువగా వచ్చాయని భావించే విద్యార్థులకు ఇంటర్‌ బోర్డు ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది.

రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తులు

రీకౌంటింగ్‌ (RC), రీ వెరిఫికేషన్‌(RV)కు అవకాశం ఇస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. వీటి కోసం అభ్యర్థులు ఏప్రిల్‌ 18-24వ తేదీ వరకు  రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. 
 

Published date : 12 Apr 2024 03:44PM

Photo Stories