Free Admissions: ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉచిత విద్య‌!

ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో పేద విద్యార్థుల ప్రవేశానికి రంగం సిద్ధమైంది. దరఖాస్తులకు సంబంధించి మొదటి విడత జాబితాను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు..

మదనపల్లె సిటీ: జిల్లాలోని ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటో తరగతిలో పేద విద్యార్థుల ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు మొదటి విడత చిన్నారుల జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం సెక్షన్‌ 12(1) (సి) ప్రకారం ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇవ్వాలి. 2024–25 విద్యా సంవత్సరానికి ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీనిని అనుసరించి 1132 మంది దరఖాస్తు చేసుకోగా 600 మంది తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన మొదటి విడత జాబితాను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు.

Inter Admissions 2024: ఇంటర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను విడుదల

మొదటి విడతలో..

జిల్లా వ్యాప్తంగా 600 మంది చిన్నారులకు ఒకటవ తరగతిలో ప్రవేశానికి అవకాశం కల్పించారు. జిల్లా పరిధిలోని వివిధ మండలాల్లో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఆయా పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తూ తొలి జాబితాను సమగ్రశిక్ష అధికారులు విడుదల చేశారు. మొదటి విడత జాబితా విడుదలతో ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించారు.

’జిల్లా వ్యాప్తంగా...

జిల్లాలో ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలు విద్యాహక్కు చట్టం ప్రకారం సీఎస్‌ఈ వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాయి. పాఠశాల విద్యాశాఖ జిల్లాల వారీగా వీటి జాబితాను ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు గతంలోనే పంపించి, సీఎస్‌ఈ వెబ్‌పోర్టర్‌లో నమోదయ్యేలా చర్యలు చేపట్టింది. ఐబీ, ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, స్టేట్‌ సిలబస్‌లు అమలవుతున్న ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి. రిజిస్ట్రేషన్‌ అనంతరం ఆయా పాఠశాలలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 25 శాతం సీట్లను ఒకటో తరగతి విద్యార్థులకు కేటాయించాలి. ప్రస్తుతం విడుదల చేసిన మొదటి విడత అడ్మిషన్లలో భాగంగా 600 విద్యార్థులకు సీట్లు కేటాయించారు. వీరందరూ ఈనెల 20వతేదీ లోపు ఆయా పాఠశాలలకు వెళ్లి అడ్మిషన్లు తీసుకోవాలి. ఈ విషయాన్ని ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రుల సెల్‌ఫోన్లకు విద్యాశాఖ అధికారులు సమాచారం పంపించారు.

Amma Adarsh ​​School Committee: పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి

మండలం కేటాయించిన సీట్లు

మదనపల్లె 125

రాయచోటి 100

పీలేరు 58

రాజంపేట 48

బి.కొత్తకోట 39

ఓబులవారిపల్లె 23

గాలివీడు 22

ములకలచెరువు 24

కోడూరు 31

పెనగలూరు 17

టి.సుండుపల్లి 16

చిట్వేలి 23

గుర్రంకొండ 11

నందలూరు 11

TS Adarsha Vidyalaya Admissions: ‘ఆదర్శ’లో ప్రవేశాలుకు దరఖాస్తులు స్వీకరణ‌.. సీట్ల భర్తీ ఇలా..

పుల్లంపేట 9

కె.వి.పల్లి 8

కురబలకోట 9

లక్కిరెడ్డిపల్లె 5

తంబళ్లపల్లె 3

వాల్మీకిపురం 4

పి.టి.సముద్రం 2

రామాపురం 2

కలకడ 1

నిమ్మనపల్లె 2

రామసముద్రం 1

కలికిరి 6

CBSE Students Talent: ప‌ది, ప‌న్నెండు సీబీఎస్‌సీ ఫ‌లితాల్లో విద్యార్థుల స‌త్తా!

జాబితా విడుదల

విద్యాహక్కు చట్టం ప్రకారం మొదటి విడత జాబితాను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. గత విద్యా సంవత్సరంలో కూడా ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో పేద విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాం. ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలకు ఈ చట్టంపై అవగాహన ఉంది.

–శివప్రకాష్‌రెడ్డి, డీఈవో

#Tags