EAPCET Special Category Students : ఈఏపీసెట్ స్పెషల్ కేటగిరి విద్యార్థుల సర్టిఫికెట్ పరిశీలిన బుధవారం ముగిసింది..
మొగల్రాజపురం: ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్తంగా నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్–2024 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరి విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన బుధవారం సాయంత్రంతో ముగిసింది. నగరంలోని బెంజ్‌సర్కిల్ సమీపంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్‌లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి స్పెషల్ కేటగిరి విద్యార్థులు స్వయంగా ఈ కేంద్రానికి హాజరై వారి సర్టిఫికెట్లను చెక్ చేయించుకున్నారు.
TS PolyCET 2024 Counselling: వ్యవసాయ వర్సిటీలో ప్రారంభమైన కౌన్సెలింగ్.. చివరి తేదీ ఇదే
విభిన్న ప్రతిభావంతులు–178, స్కౌట్స్ అండ్ గైడ్స్–56, ఆంగ్లో ఇండియన్ ఒకరు మొత్తం 235 మంది సర్టిఫికెట్లను బుధవారం పరిశీలించామని హెల్ప్‌లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి చెప్పారు. స్పెషల్ కేటగిరి విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ముగిసిందన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిన విద్యార్థులు ఈ నెల 12 తేదీ లోగా వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు.