Students in Schools : పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఇంతేనా!
కొలిమిగుండ్ల: పాఠశాలలు తెరిచి నెల రోజులు పూర్తవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులు, నాణ్యమైన చదువుల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టి అవగాహన కల్పించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండల పరిధిలోని ఎర్రగుడిలో ప్రాథమిక మెయిన్ పాఠశాల, బీసీ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడే తరగతి గదులు ప్రస్తుతం బోసిపోతున్నాయి.
Data Entry Operator Jobs: డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు.. వారికి స్కిల్ టెస్టులు
ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభం అయినా విద్యార్థుల సంఖ్య పెరగకపోవడం శోచనీయం. గత విద్యా సంవత్సరంలో మూడు నుంచి ఐదవ తరగతి వరకు ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ప్రస్తుతం ఒకటి, రెండు తరగతుల విద్యార్థులు మెయిన్ పాఠశాలలో ఐదుగురు, బీసీ పాఠశాలలో ఐదుగురు చొప్పున విద్యార్థులున్నారు. ఉన్నత పాఠశాలలో మూడు నుంచి ఐదో తరగతి విద్యార్థులు ఏడుగురు మాత్రమే ఉన్నారు. రెండు ప్రాథమిక పాఠశాలల్లో కొన్ని సందర్బాల్లో విద్యార్థులు గైర్హాజరైతే ఒకరిద్దరు ఉంటున్న సందర్భాలు ఉన్నాయి.
Lakshmapuram ZP School: 8 మంది టీచర్లు.. 10 మంది విద్యార్థులు