Dasara Holiday Extend 2023 : ద‌స‌రా సెలవులు పొడిగింపు...? కార‌ణం ఇదే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : దేశంలో అత్యంత ఘ‌నంగా జ‌రుపుకునే పండ‌గ‌ల్లో ద‌స‌రా పండ‌గ టాప్‌లో ఉంటుంది. స్కూల్స్‌, కాలేజీల విద్యార్థుల‌కు ఈ పండ‌క్కే ఎక్కువ రోజులు సెల‌వులు వ‌స్తుంటాయి.
dasara holidays 2023 extended

అయితే ఈ పండ‌గ సెల‌వులు నేటితో (అక్టోబ‌ర్ 24వ తేదీ) ముగియ‌నున్నాయి.  తెలంగాణ‌లో 13రోజుల పాటు సెలవులు ఉండగా... తిరిగి అక్టోబర్ 26న పాఠశాలల తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అక్టోబ‌ర్ 14వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 24వ తేదీ వరకు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూల్స్ విద్యాశాఖ‌ దసరా సెలవులు ఇచ్చిన‌ విష‌యం తెల్సిందే. 

☛ November 29th,30th Holidays : న‌వంబ‌ర్ 29, 30 తేదీల్లో స్కూల్స్, కాలేజీల‌కు సెల‌వులు.. అలాగే డిసెంబర్ 3న కూడా..

అలాగే క‌ర్నాట‌క‌లో అక్టోబ‌ర్ 8వ తేదీ నుంచి 24వ తేదీ వ‌ర‌కు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చారు. అంటే దాదాపు 16 రోజులు పాటు సెల‌వులు ఇచ్చారు. అత్య‌ధికంగా స్కూల్స్‌, కాలేజీల‌కు ద‌స‌రా సెల‌వులు ఇచ్చింది ఈ రాష్ట్రంలోనే.

➤ Dussehra Holidays 2023 Changes : ఆంధ‌ప్ర‌దేశ్‌లో దసరా సెలవుల్లో మార్పులు.. ఆ రెండు రోజులు కూడా..

దేశంలోనే అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా పండ‌గ క‌ర్నాట‌క‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అయితే కోవిడ్ కార‌ణంతో క‌ర్నాట‌క‌లో ఈ పండ‌గ‌ను గ‌త రెండేళ్లుగా స‌రిగ్గా జ‌రుపుకోలేదు. ఇప్పుడు క‌ర్నాట‌కలో ఈ పండ‌గ‌ను ఎంతో ఘ‌నం నిర్వ‌హిస్తున్నారు. విద్యార్థులు, త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు ఈ దసరా పండ‌గ సెల‌వుల‌ను అక్టోబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు పొడిగించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. అయితే ఈ సెలవుల పొడిగింపుపై ప్ర‌భుత్వం ఈ రోజు తుది నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ ద‌స‌రా సెల‌వులు పొడిగించే అవ‌కాశం క‌న్పించ‌డం లేదు. య‌థావిధిగా స్కూల్స్‌, కాలేజీలు షెడ్యూల్ ప్ర‌కారం తిరిగి ప్రారంభం కానున్నాయి.

సెల‌వుల పండ‌గ‌..

ఈ ఏడాది స్కూల్స్‌, కాలేజీలకు అనుకోకుండా వ‌చ్చే సెల‌వులు ఎక్కువ‌గానే వ‌స్తున్నాయి.  ఇటీవ‌లే క‌ర్ణాటక-తమిళనాడు మధ్య చెలరేగుతున్న కావేరి నదీ జలాల వివాదంపై స్కూల్స్‌, కాలేజీల‌తో పాటు ఇత‌ర సంస్థ‌ల‌కు బంద్ ఇచ్చిన విష‌యం తెల్సిందే. దీంతో సెప్టెంబ‌ర్ నెల‌లో వ‌రుస‌గా నాలుగు రోజులు పాటు సెల‌వులు వ‌చ్చాయి. అలాగే అక్టోబ‌ర్‌లో దాదాపు 16 రోజులు పాటు ద‌స‌రా పండ‌గ‌తో సెల‌వుల వ‌చ్చిన విష‌యం తెల్సిందే.

➤ గుడ్‌న్యూస్‌.. ఈ సారి దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ఇవే.. మొత్తం ఎన్ని రోజులంటే..?

దీపావళి, క్రిస్మస్ సెలవులు ఇలా..

దసరా తర్వాత వచ్చే దీపావళి పండగకు ఒక్క రోజు మాత్రమే సెలవు ఇచ్చింది. న‌వంబ‌ర్‌ 12వ తేదీన(ఆదివారం) దీపావళి పండుగ రావ‌టంతో అ రోజు సెలవు ప్ర‌క‌టించారు. పండితులు కూడా 12వ తేదీనే జరుపుకోవాలని తేల్చి చెబుతున్నారు. పంచాంగాల్లో కూడా ఇదే విషయం పొందుపరిచి ఉందని స్పష్టం చేశారు. క్యాలెండర్లలో 12వ తేదీనే అమావాస్య ఉండటంతో పండుగ అదే రోజు ఉంటుందన్న భావన జనంలో వ్యక్తమైంది. అయితే ఈ ప్ర‌భుత్వం సోమ‌వారం దీపావళి పండుగకు సెల‌వు ఇచ్చే అవ‌కాశం ఉంది 

సంక్రాంతికి ఆరు రోజులు పాటు..

అలాగే డిసెంబర్ నెలలో వచ్చే క్రిస్మస్ సెలవులను ఐదు రోజులు ఇచ్చింది. డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఐదు రోజులపాటు మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని, ఇతర స్కూళ్లకు మాత్రం ఒక్క రోజు సెలవు ఉంటుందని పేర్కొంది. అలాగే ఈ విద్యా సంవత్సరంలో వచ్చే మరో పెద్ద పండగ సంక్రాంతికి ఆరు రోజుల సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. బోగి, సంక్రాంతి, కనుమ పండగలతో కలిపి 6 రోజులు సెలవులు (జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు) సంక్రాంతి సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ 2023-24లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..:

☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు

#Tags