Corporate Education: పేద విద్యార్థులకు పాఠశాలలో ఉచిత ప్రవేశాల అవకాశం..!

కార్పొరేట్‌ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు అందిస్తున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేశారు. ప్రకటించిన తేదీలోగా అర్హులందరూ వారి వివరాలను దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలను పరిశీలించండి..

బొమ్మనహాళ్‌: విద్యా హక్కు చట్టాన్ని (ఆర్‌టీఈ) అనుసరించి నిరుపేద విద్యార్థులకు ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో విద్యనందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్ధులకు ఉచితంగా కేటాయించాల్సి ఉంది. ఈ మేరకు ఆయా స్కూళ్లలో ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలు ఈ పథకానికి అర్హులు. ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లలో పేద విద్యార్థులను చేర్చేలా ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Osmania University: ఓయూ పూర్వవిద్యార్థి భారీ విరాళం

పక్కాగా అమలు

గత టీడీపీ ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసింది. నిబంధనల మేరకు ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్ధులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాల్సి ఉండగా ఎక్కడా అమలుకు నోచుకోలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఉచిత విద్యనందించేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పటిష్ట చర్యలు తీసుకున్నారు. నిబంధనల మేరకు అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న వారిని ప్రభుత్వమే ఎంపిక చేస్తోంది. ఈ మేరకు 2023–24 విద్యాసంవత్సరంలో అర్హులైన వారిని ఎంపిక చేసి ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లలో ప్రవేశాలు కల్పించారు. ఉచిత ప్రవేశాలకు నిరాకరించిన యాజమాన్యాలపై విద్యాశాఖ చర్యలకు సిద్ధపడడంతో విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లు కేటాయించేందుకు ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ముందుకు వచ్చాయి.

Kasturba Gandhi Balika Vidyalaya: అభాగ్యులకు అండగా నిలిచిన కస్తూర్బాగాంధీ విద్యాలయం

మార్చి 14 వరకూ దరఖాస్తుల స్వీకరణ

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై ఏటా అర్హులైన పేద విద్యార్ధులకు ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత అడ్మిషన్‌ కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ పటిష్ట చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. సీబీఎస్‌ఈ. స్టేట్‌ సిలబస్‌ అమలవుతున్న ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్ధులకు కేటాయించేలా చర్యలు తీసుకున్నారు.

Engineering College: సాంకేతిక అభివృద్ధికి అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కీలకంగా నిలుస్తుంది

దరఖాస్తుకు షెడ్యూల్‌ ఇలా...

● ఆసక్తి ఉన్న విద్యార్థులు http://cse.ap. gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

● మార్చి 14 వరకూ విద్యార్థుల వివరాల నమోదుకు అవకాశం కల్పించారు.

● మార్చి 20 నుంచి 22 వరకూ దరఖాస్తు అర్హతపై చెక్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

● ఏఫ్రిల్‌ 1న లాటరీ పద్ధతి ద్వారా తొలి విడత ఎంపిక జాబితా విడుదల చేస్తారు.

● ఎంపికైన విద్యార్ధులకు ఏఫ్రిల్‌ 2 నుంచి 10వ తేదీ వరకు ఆయా పాఠశాలల్లో అడ్మిషన్లు చేపడతారు.

● ఏఫ్రిల్‌ 15న లాటరీ పద్దతి ద్వారా రెండో జాబితా విడుదల చేస్తారు.

● ఏప్రిల్‌ 16 నుంచి 23 వరకు ఆయా పాఠశాలల్లో ఎంపికైన విద్యార్థులు అడ్మిషన్లు పొందాలి.

Intermediate Courses: అందుబాటులోకి ఇంటర్మీడియట్‌ కోర్సులు

పేద విద్యార్థులకు వరం

విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ) ప్రకారం ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో పేద విద్యార్ధులకు ఒకటో తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇది పేద విద్యార్ధులకు ప్రభుత్వ కల్పిస్తున్న ఓ వరం. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశానికి విడుదలైన నోటిఫికేషన్‌ ప్రకారం అర్హులైన తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలు అర్హులు.

– మల్లికార్జున, ఎంఈఓ, బొమ్మనహాళ్‌

UPSC IFS Notification 2024: ఐఎఫ్‌ఎస్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

#Tags