Kasturba Gandhi Balika Vidyalaya: అభాగ్యులకు అండగా నిలిచిన కస్తూర్బాగాంధీ విద్యాలయం
తల్లితండ్రులకు దూరమైన వారు ఇంకొందరు.. వీరందరికీ ఓర్వకల్లు కస్తూర్బా గాంధీ విద్యాలయం ఆశ్రయం కల్పిస్తోంది. ఈ విద్యాలయంలో పనిచేసే సిబ్బంది విద్యార్థునులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బాలికలకు ఏలోటూ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించింది. విద్యాలయానికి ఆధునాతన బోధన పరికరాలను అందించింది. 2019కు ముందులో పాఠశాలలో తాగునీటి వసతి ఉండేది కాదు. విద్యుత్ సమస్యలతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడేవా రు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక మనబడి–నాడునేడుతో పాఠశాల రూపురేఖలను మార్చేసింది. ప్రతి గదిలో విద్యుత్ సదుపాయం కల్పించారు. ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, ఎల్‌ఈడీ బల్బులు, చార్జీంగ్ లైట్లు అమర్చారు. పాఠశాలలో అన్ని తరగతి గదులలో డెస్కులు, గ్రీన్‌బోర్డులను ఏర్పాటు చేశారు.
Free Service for Students: టెన్త్ విద్యార్థులకు ఉచిత ప్రయాణ అవకాశం..!
ఆంగ్ల మాధ్యమంలో బోధన..
కస్తూర్బాగాంధీ విద్యాలయంలో విద్యార్థినులకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన అందుతోంది. పాఠశాలలో మొత్తం 17గదులు ఉండగా.. అందులో 10 గదుల లో హాస్టల్, ఆఫీస్, స్టాఫ్ కోసం కేటాయించగా, మిగతా 7 గదులలో తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 232మంది ఆశ్రమం పొందుతున్నారు.
ఎల్‌ఈడీ టీవీల ఏర్పాటు..
గ్రామీణ విద్యార్థినులకు సైతం మెరుగైన వసతులతో పాటు భవిష్యత్తు తరాలను దృష్టిపెట్టుకొని సాంకేతతో కూడిన డిజిటల్ విద్యాబోధనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం పాఠశాలలో నాలుగు ఎల్‌ఈడీ టీవీలను అమర్చారు. విద్యార్థులకు అన్ని సబ్జెక్టులను డిజిటల్ రూపంలోనే బోధిస్తున్నారు. తద్వారా విద్యార్థినులలో సాంకేతిక విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు దోహదపడుతోంది.