Railway Jobs: రైల్వేలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం.. అప్లై చేసుకోండి మ‌రీ..

రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త.

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ).. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌పీఎఫ్‌)–రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌)లో ఉన్న 4,660 ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు మొదలయ్యాయి. అర్హులైన వారు మే 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య: 4660
పోస్టుల వివరాలు: సబ్‌–ఇన్‌స్పెక్టర్‌–452, కానిస్టేబుల్‌–4208.



అర్హత
సబ్‌–ఇన్‌స్పెక్టర్‌: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 
వయసు: 01.07.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
ప్రారంభ వేతనం: రూ. 35,400.

కానిస్టేబుల్‌: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
ప్రారంభ వేతనం: రూ. 21,700.

Railway Jobs: 2024లో రైల్వేలో భారీ ఉద్యోగాలు.. జాబ్‌ క్యాలెండర్‌ ఇదే..

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష.

ఎంపిక విధానం: రాతపరీక్ష,  ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్, మెడికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 15.04.2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.05.2024

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://rpf.indianrailways.gov.in/RPF/

RPF Recruitment 2024: ఈ పోస్ట్‌లకు సంబంధించిన‌ పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్ ఇదే..

#Tags