పీజీ వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం.. చివరి తేదీ ఇదే..

Post Graduate (PG) వైద్య ప్రవే శాల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని పీజీ వైద్య సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖా స్తులను ఆహ్వానిస్తూ Kaloji Narayana Rao University of Health Sciences ఆగస్టు 23న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
పీజీ వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం.. చివరి తేదీ ఇదే..

విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారు. జాతీయస్థాయి అర్హత పరీక్ష (NEET)– 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 24న ఉదయం 8 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తు పూర్తి చేయడంతోపాటు అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. యూనివర్సిటీ పరిశీలన అనంతరం అర్హుల తుది జాబితాను ప్రకటి స్తుంది. దరఖాస్తులను https://tspgmed.tsche.in వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారం నింపే సమయంలో సాంకేతిక సమస్యలకు 93926 85856, 78425 42216, 90596 72216 నంబర్లకు, నిబంధనల కోసం 94905 85796, 85006 46769 నంబర్లకు ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఫోన్‌ చేయవచ్చు. పూర్తి వివరాల కోసం https://www.knruhs.telangana.gov.inను సంప్రదించాలని తెలిపింది. 

చదవండి:

#Tags