NEET UG 2024 Paper leak: నీట్ పేపర్ లీక్ వ్యవహారం లో కీలక విషయాలు వెల్లడి?
నీట్ పేపర్ లీక్ మాస్టర్ మైండ్ సంజీవ్ ముఖియాకు సన్నిహితులైన చింటూ, ముఖేష్‌ల నుండి అందిన సమాచారం ఆధారంగా సీబీఐ అమన్ సింగ్‌ను అరెస్టు చేసింది. నిందితుడు అమన్ సింగ్.. సంజీవ్ ముఖియా మేనల్లుడు రాకీకి సన్నిహితుడు. రాకీ బీహార్‌లోని రాంచీలో హోటల్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. నీట్ పరీక్షలో పేపర్ లీక్ అయిన తర్వాత సమాధానాలను సిద్ధం చేయడానికి రాకీ సాల్వర్లను ఏర్పాటు చేశాడు. కాగా అమన్ సింగ్ అరెస్టు దరిమిలా నీట్ పేపర్ లీక్‌తో సంబంధమున్న సాల్వర్‌లు, ఇతర నిందితులను గుర్తించవచ్చని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు అమన్‌ను పట్నాకు తరలించనున్నారు.
Also Read: AP EAPCET -2024 Counselling Schedule
ఇప్పటి వరకు సీబీఐ అదుపులోకి తీసుకున్న నిందితుల రిమాండ్ గడువు జూలై 4తో ముగియనుంది. దీంతో వీరిని విచారించేందుకు సీబీఐ అదనపు రిమాండ్‌ను కోరే అవకాశాలున్నాయి. మరోవైపు నీట్ పేపర్ లీక్ తర్వాత పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై జూలై ఎనిమిదిన సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.