Skip to main content

NEET-UG Row: నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో మరో అరెస్ట్‌.. కీలక విషయాలు వెల్లడి?

Imtiaz Alam arrested in Jharkhand  NEET-UG Row  CBI investigation into NEET paper leak  Aman Singh arrested in Dhanbad

నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై విద్యార్థుల్లో ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. ఉన్నత విద్యాశాఖ ఫిర్యాదుతో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ఈ దర్యాప్తు సంస్థ అధికారులు ఇప్పటికే జార్ఖండ్‌లో డాక్టర్ ఎహ్సాన్ ఉల్ హక్, ఇంతియాజ్ ఆలంలను అరెస్టు చేశారు. తాజాగా సీబీఐ ఈ కేసులో మరో నిందితుడు అమన్‌సింగ్‌ను జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో అరెస్టు చేసింది.

NEET Exam Row: నీట్‌ కాంట్రవర్సీ.. మరోసారి పరీక్ష నిర్వహించాల్సిందేనా? దేశ వ్యాప్తంగా ఒకే పరీక్ష అవసరమా?

నీట్‌ పేపర్‌ లీక్‌ మాస్టర్‌ మైండ్‌ సంజీవ్ ముఖియాకు సన్నిహితులైన చింటూ, ముఖేష్‌ల నుండి అందిన సమాచారం ఆధారంగా సీబీఐ అమన్ సింగ్‌ను అరెస్టు చేసింది. నిందితుడు అమన్ సింగ్.. సంజీవ్ ముఖియా మేనల్లుడు రాకీకి సన్నిహితుడు. రాకీ  బీహార్‌లోని రాంచీలో హోటల్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. నీట్ పరీక్షలో పేపర్ లీక్ అయిన తర్వాత సమాధానాలను సిద్ధం చేయడానికి రాకీ సాల్వర్లను ఏర్పాటు చేశాడు. కాగా అమన్ సింగ్ అరెస్టు దరిమిలా నీట్ పేపర్ లీక్‌తో సంబంధమున్న సాల్వర్‌లు, ఇతర నిందితులను గుర్తించవచ్చని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు అమన్‌ను పట్నాకు తరలించనున్నారు.

NEET PG 2024 Exam: నీట్‌ పీజీ పరీక్ష ఖరారు.. లీకేజీ దెబ్బకు రెండుగంటల ముందే క్వశ్చన్‌ పేపర్‌ తయారు

ఇప్పటి వరకు సీబీఐ అదుపులోకి తీసుకున్న నిందితుల రిమాండ్ గడువు జూలై 4తో ముగియనుంది. దీంతో వీరిని విచారించేందుకు సీబీఐ అదనపు రిమాండ్‌ను కోరే అవకాశాలున్నాయి. మరోవైపు నీట్ పేపర్ లీక్ తర్వాత పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై జూలై ఎనిమిదిన సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.

Published date : 04 Jul 2024 11:42AM

Photo Stories