Skip to main content

NEET PG 2024 Exam: నీట్‌ పీజీ పరీక్ష ఖరారు.. లీకేజీ దెబ్బకు రెండుగంటల ముందే క్వశ్చన్‌ పేపర్‌ తయారు

NEET PG 2024 Exam

సాక్షి,న్యూఢిల్లీ : నీట్‌ యూజీ, యూజీసీ నెట్‌ ప్రశ్నపత్రాల లీకేజీపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో కేంద్రం నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేసింది.అయితే వాయిదా వేసిన ఆ పరీక్షను జులై నెలలో నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఆ ప్రశ్నాపత్రాన్ని రెండు గంటల ముందు తయారు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.నీట్‌ యూజీ పేపర్‌ లీకేజీతో జూన్‌ 23న జరగాల్సిన నీట్‌ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది.

PM Modi First Comments On NEET Paper Leak Case: నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీపై తొలిసారి స్పందించిన నరేంద్ర మోదీ.. ఏమన్నారంటే..

తాజాగా,నీట్‌ పీజీ పరీక్షను కేంద్రం నిర్వహించనుందని పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.అంతేకాదు ఈ పరీక్షలను ఆరోగ్య,కుంటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ నిర్వహించనుందని తెలుస్తోంది. 

Published date : 04 Jul 2024 08:59AM

Photo Stories