Degree Admissions2024 : డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్‌కు 10న ఆఖరు
Sakshi Education
శ్రీకాళహస్తి: పట్టణంలోని శ్రీస్వామి విద్యాప్రకాశనంద పురుషుల డిగ్రీ కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థులు ఓఏఎండీసీ పోర్టల్‌లో ఈ నెల 10వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.శ్రీలత కోరారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ అనంతరం 11 నుంచి 15వ తేదీ వరకు కోర్సుల ఎంపిక.. 19న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. అర్హత పొందిన విద్యార్థులు 20వ తేదీ నుంచి కళాశాలలో రిపోర్టు చేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9440167239, 7780390914 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Also Read: Degree Admissions2024 : డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
Published date : 04 Jul 2024 09:00AM