Skip to main content

Certificate Verification : ఈ-సెట్‌లో విద్యార్థుల స‌ర్టిఫికెట్ ప‌రిశీలన ప్రారంభం..

Certification verification start for AP ECET 2024 rank students

విజయవాడ తూర్పు: ఈసెట్‌–2024 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం మొదలైంది. విజయవాడ నగరంలోని రమేష్‌ ఆస్పత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో సర్టిఫికెట్ల పరిశీలన కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో స్పెషల్‌ కేటగిరీకి చెందిన విద్యార్థులు హాజరయ్యారు. సీఏపీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌, ఆంగ్లో ఇండియన్‌ విభాగానికి చెందిన 348 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను మంగళవారం పరిశీలించారు. జనరల్‌ కేటగిరీ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఆన్‌లైన్‌లో జరుగుతుంది.

Teacher V Madhavi: రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయురాలి ప్రతిభ

నేటి షెడ్యూల్‌ ఇది..

సీఏపీ 20001 నుంచి చివరి ర్యాంకు వరకు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ విద్యార్థులకు 15001 నుంచి చివరి ర్యాంకు వరకు, విభిన్నప్రతిభావంతులు, స్కౌట్స్‌ అండ్‌ గౌడ్స్‌ విద్యార్థులకు మొదటి నుంచి చివరి ర్యాంకు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లను బుధవారం పరిశీలిస్తామని హెల్ప్‌ లైన్‌ సెంటర్‌ కో–ఆర్డినేటర్‌ ఎం.విజయసారథి చెప్పారు.

CA Firms: అంతర్జాతీయ దిగ్గజాలుగా దేశీ ఆడిటింగ్‌ సంస్థలు

Published date : 03 Jul 2024 04:47PM

Photo Stories