Nursing Officer Job in AIIMS: ఎయిమ్స్‌లో నర్సింగ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలు ఇవే

నర్సింగ్‌ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌! న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ కేంద్రాల్లో నర్సింగ్ ఆఫీసర్స్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


పోస్టు వివరాలు: నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు
అర్హత: బీఎస్సీ నర్సింగ్‌/బీఎస్సీ నర్సింగ్‌ ఆనర్స్‌ ఉత్తీర్ణత ఉండాలి. లేదా పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి(లేదా) జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీలో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. దీంతోపాటు  కనీసం రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి. విద్యార్హతలతోపాటు స్టేట్‌ కౌన్సిల్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యులై ఉండాలి.

వయసు: 18 –30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. 

Job Hirings: భారీగా పెరిగిన ఉద్యోగ నియామకాలు.. 'నౌకరీ' జాబ్‌ స్పీక్‌ ఇండెక్స్‌ రిపోర్ట్‌

వేతనం: రూ.9,300- రూ.34,800తో పాటు రూ.4600 గ్రేడ్ పే అందుతుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.3000; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2400; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.


ఎంపిక ప్రక్రియ: నార్‌సెట్‌-7 ప్రిలిమినరీ, ప్రధాన పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది

NEET UG 2024 Counselling Schedule Out: ఈనెల 14 నుంచి నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌.. ఈ సర్టిఫికేట్స్‌ తప్పనిసరి

 

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 21, 2024
దరఖాస్తు సవరణ తేదీలు: ఆగస్టు 22-24, 2024 వరకు

 సీబీటీ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: సెప్టెంబర్‌ 15, 2024
 సీబీటీ మెయిన్ పరీక్ష తేదీ: అక్టోబర్‌ 04, 2024
 

#Tags