Job Fair: జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి

నరసరావుపేట: కోటప్పకొండరోడ్డులోని నరసరావుపేట ఇంజినీరింగ్‌ కళాశాల(ఎన్‌ఈసీ)లో సెప్టెంబర్ 23వ తేదీన నిర్వహించే మెగా జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మె ల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. డిపార్టుమెంట్‌ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిర్వహిస్తున్న జాబ్‌ మేళా బ్రోచర్‌ వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ మెగా జాబ్‌మేళాలో మాస్టర్‌మైండ్‌, అఫెక్స్‌ సొల్యూషన్‌, స్కిల్‌ క్రాఫ్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌, తోషిబా వంటి 18 రకాల కంపెనీలు హాజరై సుమారుగా 700 ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. విద్యార్హతను బట్టి జీతం సుమారుగా రూ.10 నుంచి రూ.35 వరకు ఉంటుందన్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, బీటెక్‌, డిప్లొమా, ఫార్మసీ, పీజీ వరకు చదువుకున్న 18–45ఏళ్ల మధ్యనున్న నిరుద్యోగ యువతి యువకులు బయోడేటా, రెజ్యూమ్‌, ఎడ్యుకేషన్‌ సర్టిఫికెట్స్‌ జిరాక్స్‌, ఆధార్‌ నకలు, పాస్‌పోర్ట్‌ ఫొటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. నోడల్‌ అఫీసర్‌ సంజీవరావు మాట్లాడు తూ మరిన్ని వివరాలు కోసం ఎ.రమ్య: 83285 44388, ఎం.వీరాంజనేయులు : 91602 00652, వై.శ్రీనివాసరెడ్డి: 99084 82907లను సంప్రదించాలని కోరారు. ఔత్సాహిక యువతీయువకులు ముందుగా ఏపీఎస్‌ఎస్‌డీసీ అనే వెబ్‌సైట్‌లో తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకోసం పైన తెలిపిన నంబర్లలో సంప్రదించాలని, రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోనటువంటి యువతీయువకులు జాబ్‌ డ్రైవ్‌ జరిగే ప్రదేశంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని వివరించారు.
 

#Tags