TSRTC To Recruit 813 Compassionate Appointments- కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

ఎట్టకేలకు కారుణ్య నియామక ప్రక్రియకు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులకోసం కారుణ్య నియామకాల కింద కండక్టర్‌ పోస్టులను భర్తీ చేయాలని సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 1,600 కుటుంబాలు ఈ పథకంకోసం ఎదురు చూస్తున్నాయి. వాటిల్లో 813 దరఖాస్తులను మాత్రమే డిపో అధికారులు బస్‌ భవన్‌కు ఫార్వర్డ్‌ చేశారు.

ఇప్పట్లో ఈ నియామకాలు వద్దని గతంలో ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశించటంతో మిగతా దరఖాస్తులు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు ప్రక్రియ ప్రారంభించారు.

ఇందులో భాగంగా 813 కండక్టర్‌ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కారుణ్య నియామకాలకు సంబంధించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కొత్తగా 275 బస్సుల కొనుగోలుకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. 

#Tags