Job Mela: రేపు జాబ్‌మేళా.. వీళ్లు అర్హులు

గుంటూరు: గుజ్జనగుండ్లలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 2న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.రఘు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫెయిర్‌ డీల్‌ క్యాపిటల్‌, హెచ్‌–1 హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌, కేప్‌స్టన్‌ సర్వీసెస్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, ఎంబీఏ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు గల నిరుద్యోగ యువత జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని తెలిపారు. వివరాలకు 98668 22697, 87907 90762 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Toughest State Board Exams: ఈ రాష్ట్రాల్లో బోర్డ్‌ ఎగ్జామ్స్‌ రాయాలంటే స్టూడెంట్స్‌కి చుక్కలే.. అత్యంత కఠినంగా ప్రశ్నలు

 

#Tags