Indian Air Force Agniveervayu Intake Notification 2024- పెళ్లికాని వాళ్లే ఈ పోస్టుకు అర్హులు, నెలకు 30వేలు జీతం

అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్వాయు పోస్టుల భర్తీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పెళ్లికాని యువతీ, యువకులు అప్లై చేసుకోవచ్చు. 

అర్హత:
అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఉండాలి. మ్యాథ్స్‌,ఫిజిక్స్‌, ఇంగ్లీష్‌ సబ్జెక్టుల్లో కనీసం 50% మార్కులు వచ్చి ఉండాలి. లేదా మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌, ఆటోమొబైల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్స్రుమెంటేషన్‌ టెక్నాలజీలో 50% మార్కులతో మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి.

లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తించబడిన బోర్డుల నుంచి రెండేళ్ళ వొకేషనల్ కోర్సుల్లో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులో కనీసం మార్కులతో పాసై ఉండాలి. ఒకేషనల్ కోర్సులో ఆంగ్లంలో 50% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్‌లో 50% ఇంగ్లీషులో ఉత్తీర్ణత సాధించాలి. 

వయస్సు: 02 జనవరి 2004-02 జూలై 2007 మధ్య జన్మించిన అభ్యర్థులు అర్హులు
వేతనం: నెలకు రూ. 30వేలతో పాటు ఇతర అలవెన్సులు

​ఎగ్జామ్‌ ఫీజ్‌: 550 రూపాయలు+జీఎస్టీ
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ఎప్పటినుంచి:17.01.2024

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.02.2024
వెబ్‌సైట్‌: https://agnipathvayu.cdac.in/AV/

#Tags