TS SET 2024: టీఎస్ సెట్–2024కు ఇన్ని దరఖాస్తులు.. ఈసారి ఫీజులు మాత్రం ఇలా..
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్–2024)కోసం మే 14 నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తులకు 1,500 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ మేరకు టీఎస్ సెట్ సభ్య కార్యదర్శి ప్రొ.నరేశ్‌రెడ్డి మే 22న తెలిపారు. ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానున్న టీఎస్ సెట్‌కు జూలై 2 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.
చదవండి: ITI Courses: ఐటీఐ కోర్సులతో ఉద్యోగావకాశాలు..
ఈసారి టీఎస్ సెట్‌కు కొత్తగా ఫీజులు పెంచలేదని ఆయన వెల్లడించారు. ఇటీవల వివిధ విద్యార్థి సంఘాల నాయకులు టీఎస్‌సెట్–2024 ఫీజును తగ్గించాలని వినతి పత్రాలను సమర్పించారని అయితే ఈ పరీక్షలకు కేవలం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులే హాజరవుతారని ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ వ్యయం అధికంగా ఉంటోందని అందుకే ఫీజును తగ్గించలేమని వివరించారు.
Published date : 23 May 2024 01:22PM