ITI Courses: ఐటీఐ కోర్సులతో ఉద్యోగావకాశాలు..
మొగల్రాజపురం: ఐటీఐ కోర్సులతో ఉద్యోగం త్వరగా పొందవచ్చని ఒకేషనల్ గైడెన్స్ జిల్లా కమిటీ చైర్మన్ దేవరపల్లి విక్టర్‌బాబు అన్నారు. విజయవాడ రమేష్ ఆస్పత్రి రోడ్డు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలోని జిల్లా ఉపాధి కల్పనశాఖ కార్యాలయం ఆవరణలో సోమవారం ఒకేషనల్ గైడెన్స్ కమిటీ సమావేశం జరిగింది. విక్టర్ బాబు మాట్లాడుతూ ఐటీఐ చదివి అప్రెంటీస్ పూర్తి చేసిన వెంటనే అభ్యర్థి నైపుణ్యం మేరకు ప్రభుత్వ శాఖలతో పాటుగా ప్రైవేటు కంపెనీల్లో త్వరగా ఉద్యోగం పొందవచ్చని చెప్పారు. రైల్వే, ఆర్మీ సహా అనేక ప్రభుత్వ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని తెలిపారు.
New Medical Colleges: మరో ఐదు మెడికల్ కాలేజీలు
ప్రైవేట్ రంగంలో సులభంగా ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కనకారావు మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో చేరడానికి అడ్మిషన్ల ప్రక్రియ మొదలైందని, ఆసక్తి ఉన్న విద్యార్థులు జూన్ 10 వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. టెన్త్ పూర్తి చేసిన వారితో పాటు ఎనిమిదో తరగతి విద్యార్హతతో కూడా కొన్ని కోర్సులను ప్రవేశపెట్టామని ఈ అవకాశాన్ని విద్యా ర్థులు వినియోగించుకోవాలని కోరారు. జిల్లా పరిశ్రమలశాఖ అధికారి సాంబయ్య, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి ఎస్.ఎన్.రెడ్డి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.నరేష్, ఒకేషనల్ గైడెన్స్ అధికారి వై.సత్య బ్రహ్మం, ప్రాంతీయ ఉపాధి కల్పన అధికారి రామ్మోహన్‌రెడ్డి, జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఎ.పూర్ణిమ, ప్రవేటు రంగ సంస్థల నుండి వరు ణ్ మోటార్స్ సంస్థ ప్రతినిధి కిషోర్ పాల్గొన్నారు.
Gurukul Students Talent: బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్క్‌టెక్చర్ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ..