Skip to main content

Job Mela: జాబ్‌ మేళా.. ఉచితంగా ట్రైనింగ్‌, జాబ్‌

Job Fair Announcement  Job Mela  Amararaja Skill Development Center Opportunity   Anantapuram Job Fair on 23rd

అనంతపురం: అనంతపురం ఉప్పరపల్లి రోడ్డులో ఆర్డీటీ స్టేడియం ఎదురుగా ఉన్న ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌లో ఈ నెల 23న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ వై.వీ.మల్లా రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. అమరరాజా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో రెండు సంవత్సరాల ఉచిత టెక్నికల్‌ శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తారు.

వీళ్లే ఉద్యోగమేళాకు అర్హులు
పదో తరగతి పాస్‌, ఫెయిల్‌, ఇంటర్‌ పాస్‌/ఫెయిల్‌, ఐటీఐ పాస్‌/ ఫెయిల్‌ (ఏ ట్రేడ్‌ అయినా) ఉద్యోగ మేళాకు అర్హులు. 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న యువత మేళాలో పాల్గొనవచ్చు. శిక్షణ సమయంలో స్టైఫండ్‌ ఉంటుంది. మొదటి మూడు నెలలు రూ.7,500, తరువాత 9 నెలలు రూ.11,453, చివరి 12 నెలలు రూ.11,653 చెల్లిస్తారు.

యువతీ,యువకులకు వేర్వేరు హాస్టల్‌ వసతి కల్పిస్తారు. శిక్షణానంతరం సర్టిఫికెట్‌ అందజేస్తారు. ఆసక్తి గల వారు తమ రెజ్యూమ్‌ లేదా బయోడేటాతో ఈ నెల 23న జాబ్‌మేళాకు హాజరుకావచ్చు. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు : 90000 24919, 91004 77371, 77807 52418.
 

Published date : 21 May 2024 05:13PM

Photo Stories