Campus Drive : పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థుల‌కు క్యాంప‌స్ డ్రైవ్‌.. ఎప్పుడు..?

మురళీనగర్‌: కంచరపాలెం ప్రభుత్వ కెమికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (గైస్‌)లో ఆటో లివ్‌ కంపెనీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యార్థులకు ఈ నెల 20న క్యాంపస్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు గైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.వి.రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆటో మొబైల్‌ రంగానికి చెందిన వివిధ పరికరాలు, వస్తువుల తయారీ రంగంలో పేరుగాంచిన ఈ కంపెనీ డిప్లొమా ట్రైనీల ఎంపిక ప్రక్రియ ఆరోజు 9.30 గంటలకు నిర్వహిస్తామన్నారు.

CBSE Mandates NCERT Textbooks for Schools: ఇకపై ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు తప్పనిసరి.. స్కూళ్లకు సీబీఎస్‌ఈ ఆదేశాలు

పాలిటెక్నిక్‌ డిప్లొమా మెకానికల్‌, ఆటో మొబైల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగాలకు చెందిన 2022, 2023, 2024 పాస్‌అవుట్‌ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. విద్యార్థులు వారి అప్‌డేటెడ్‌ రెజ్యూమేతోపాటు సర్టిఫికెట్లు తీసుకు రావాల్సి ఉంటుంది. వీరికి ప్రాథమికంగా రూ.2.36 లక్షల వార్షిక ప్యాకేజీ ఇస్తారు. ఎంపికై న వారు ఆ సంస్థకు చెందిన కాంచీపురం, చైన్నె క్యాంపస్‌లో పనిచేయాల్సి ఉంటుంది.

Govt Teachers Adjustment : ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఉపాధ్యాయుల స‌ర్దుబాటు ప్ర‌క్రియ‌ వాయిదా.. ఈ తేదీకే..

#Tags