Govt Teachers Adjustment : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ వాయిదా.. ఈ తేదీకే..
అచ్యుతాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో పని సర్దుబాటు ప్రక్రియను వాయిదా వేశారు. అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ నెల 19వ తేదీ తర్వాతే సర్దుబాటు ప్రక్రియ పూర్తి కానుంది. ముందుగా ఈ నెల 12న ఉపాధ్యాయుల పని సర్దుబాటుని మండల స్థాయిలో పూర్తి చేయాలని భావించారు. దీనికి సంబంధించి మిగులు ఉపాధ్యాయుల్ని గుర్తించే విషయంలో ఎన్నుకున్న అంశాలలో కొన్ని సహేతుకంగా లేవని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. 12వ తేదీ మధ్యాహ్నం పూర్తి చేయాల్సిన మండల స్థాయి సర్దుబాటును చివరి నిమిషంలో 17వ తేదీ నాటికి వాయిదా వస్తున్నట్టు ముందుగా ప్రకటించారు.
Scholarship: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి దరఖాస్తుల ఆహ్వానం
అయితే, అనకాపల్లి జిల్లాలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ఈ నెల 17న నిర్వహించాల్సి ఉంది. దీంతో పాఠశాలల హెచ్‌ఎంలలో కొద్దిపాటి గందరగోళం నెలకొని ఉంది. అయితే జిల్లా విద్యాశాఖ ఈ అంశంలో ఇంకా కసరత్తు చేస్తోంది. మిగులు ఉపాధ్యాయులు అనకాపల్లి జిల్లా పరిధిలో 847 వరకూ ఉన్నట్లు అంచనా. కానీ ఎస్‌జీటీ స్థానాలు మిగిలి ఉన్నవి చాలా తక్కువే. ఈ క్రమంలో మిగులు ఉపాధ్యాయుల్ని మండల స్థాయిలో గుర్తించిన మేరకు అవరోహన క్రమంలో జూనియర్‌లను ముందుగా ఆయా మండలంలో అవసరమైన చోట సర్దుబాటు చేసి మిగిలిన వారిని యధావిధిగా వారి స్థానాల్లోకి పంపించాలని ఒక ప్రతిపాదనగా ఉంది. కానీ ఈ విషయంలో ఇంకా స్పష్టత లేదు.
Free Employment Courses : ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ.. వీరే అర్హులు..
మరో వైపు ఎంపీయూపీ పాఠశాలల్లో 6,7,8 తరగతుల్ని బోధించే సబ్జెక్టు టీచర్ల కొరత ఎక్కువగా ఉంది. ఎస్‌జీటీలకు పదోన్నతులిస్తే ఖాళీ అయిన స్థానాల్లో మిగులు ఉపాధ్యాయుల్ని అధికారికంగా నియమించవచ్చు. ప్రస్తుతం మిగులు ఉపాధ్యాయుల గుర్తింపు, పని సర్దుబాటుపై కసరత్తు చేస్తున్న విద్యాశాఖ ముందుగా డీఈవో స్థాయిలో ఆ తర్వాత ఆర్‌జేడీ స్థాయిలో ధ్రువీకరించాల్సి ఉంది. 17వ తేదీన పాఠశాలల యాజమాన్య కమిటీ ఎన్నికలు ఉన్నందున 19వ తేదీలోగా పని సర్దుబాటు లేదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
Tenth Students : విజయవాడ రాజ్ భవన్‌కు పదో తరగతి విద్యార్థుల ఆహ్వానం..