TSPSC Group 2 Notification 2022 Details : 783 పోస్టులకు గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) డిసెంబర్ 29వ తేదీన (గురువారం) ఒక ప్రకటన విడుదల చేసింది. జనవరి 18వ తేదీన ఈ గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తులను స్వీరరించనున్నది.
☛ టీఎస్‌పీఎస్సీ → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్
ఇప్పటికే గ్రూప్-1, పోలీస్, వైద్యారోగ్యశాఖతో పాటు వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజినీర్ తదితర పోస్టులకు నోటిఫికేషన్లు విడదల చేసిన విషయం తెల్సిందే. ఇందులో పోలీస్, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు కూడా పూర్తయ్యాయి.
గ్రూప్-2లోని పోస్టుల వివరాలు ఇలా..
గతంలో గ్రూప్-2లో 663 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇవ్వగా.. తాజా చేర్పుల అనంతరం ఆ సంఖ్య 783 కు చేరింది. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్ (నాయిబ్ తహసీల్దార్), సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–2, జూనియర్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ (కో–ఆపరేటివ్ సబ్ సర్వీసెస్), అసిస్టెంట్ రిజిస్ట్రార్ (కో–ఆపరేటివ్ సబ్ సర్వీసెస్), అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (మండల పంచాయతీ అధికారి), ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (పీఆర్), అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(హ్యాండ్‌లూమ్ అండ్ టెక్స్‌టైల్స్), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఎండోమెంట్), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెక్రెటేరియట్, లెజిస్లేచర్, ఫైనాన్స్, లా).
చదవండి: TSPSC Group 4 Notification: 9,168 గ్రూప్-4 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
గ్రూప్–2 కేటగిరీలో..
ప్రస్తుతం గ్రూప్–2 కేటగిరీలో పై 16 రకాల పోస్టులుండగా.. ఇందులో మరో 6 రకాల పోస్టులను చేర్చింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సర్విస్), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఇతర ప్రభుత్వ శాఖలు), డ్రిస్టిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (జువైనల్ కరెక్షనల్ సర్వీస్), అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ (బీసీ వెల్ఫేర్ సబ్ సర్వీస్), అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ట్రైబల్ వెల్ఫేర్ సబ్ సర్వీస్), అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ఎస్సీడీడీ సబ్ సర్వీస్) ఉద్యోగాలు ఇకపై గ్రూప్–2 సర్విసుల్లోకి వస్తాయి.
గ్రూప్–2 పరీక్షా విధానం ఇదే..:
టీఎస్‌పీఎస్సీ గ్రూప్–2లో ఇప్పటివరకు రాత పరీక్షలతో పాటు ఇంటర్య్వూ విధానం ఉండేది. దీనివల్ల నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోందన్న భావనతో తెలంగాణ ప్రభుత్వం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసింది. భర్తీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలవుతుందని భావించి ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గతంలో మొత్తం 675 మార్కులకు ఉండే గ్రూప్–2 పరీక్షను (ఇంటర్వ్యూ 75 మార్కులు పోను) 600 మార్కులకు కుదించారు. ఈ నేపథ్యంలో గ్రూప్–2 పరీక్ష సిలబస్ కింది మేరకు ఉంటుంది.
మొత్తం మార్కులు: 600
రాతపరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) :
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నలు | సమయం (గంటలు) | మార్కులు |
1 | జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ | 150 | 2 1/2 | 150 |
2 | హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ
|
150 | 2 1/2 | 150 |
3 | ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
|
150 | 2 1/2 | 150 |
4 | తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం
|
150 | 2 1/2 | 150 |
చదవండి: టీఎస్‌పీఎస్సీ : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
TSPSC 783 గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..
783 గ్రూప్-2 పోస్టులకు సంబంధించిన సమగ్ర వివరాలు వీడియో రూపంలో..
783 గ్రూప్-2 నోటిఫికేషన్‌లోని పూర్తి వివరాలు ఇవే..