APPSC Group-1 & 2 Posts: ఆగ‌స్టులో గ్రూప్‌–1 & 2 నోటిఫికేషన్లు.. మొత్తం ఎన్ని పోస్టులకు అంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రభుత్వం సూచించిన మేరకు ఖాళీ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌ పి.గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు.
APPSC Group 1& 2 Posts notifications

జూలై 5వ తేదీన (మంగళవారం) గ్రూప్‌–1 తుది ఫలితాల విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెల ఆగ‌స్టులో 110 గ్రూప్‌–1 పోస్టులు, 182 గ్రూప్‌–2 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు.

గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

ఇంకా 2 వేల వరకు వివిధ పోస్టుల భర్తీకి..
ఇప్పటికే వివిధ ఉద్యోగాల భర్తీకి 16 నోటిఫికేషన్లు విడుదల చేయగా.. వాటిలో మూడింటిని పూర్తి చేశామని తెలిపారు. ఇంకా 13 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు, ఇతర ప్రక్రియలను ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. 2 వేల వరకు వివిధ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు.

చదవండి: ఏపీపీఎస్సీ ప‌రీక్ష స్ట‌డీమెటీరియ‌ల్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, సిల‌బ‌స్, గైడెన్స్‌, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

ఈ పోస్టుల‌కు నెలాఖరు జూలైలో పరీక్షలు..
అలాగే 670 జూనియర్‌ అసిస్టెంట్, 119 ఏఈ పోస్టులకు ఈ నెలాఖరు జూలైలో పరీక్షలు ఉంటాయన్నారు. ఈ పోస్టులకు 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారన్నారు. అత్యంత పారదర్శకంగా నిపుణులైన ఉద్యోగులను రాష్ట్రానికి అందించేలా కమిషన్‌ చర్యలు చేపడుతుందన్నారు. పోస్టులకు ఎంపిక ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా కమిషన్‌ ముందుకు వెళ్తుందన్నారు. 

Success Story: వేలల్లో వచ్చే జీతం కాద‌నీ.. నాన్న కోరిక కోసం గ్రూప్-2 సాధించానిలా..

గ్రూప్‌–1 కేడర్‌లోనూ ఈ ప‌రీక్ష త‌ప్ప‌నిస‌రిగా..
గ్రూప్‌–1 కేడర్‌ పోస్టులకు కూడా ఇక నుంచి కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ (సీపీటీ) నిర్వహించనున్నట్టు సవాంగ్‌ తెలిపారు. ఈ–గవర్నెన్స్, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌లతో పరిపాలనలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అందుకు అనుగుణంగా అధికారులు కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రూప్‌–1 పోస్టులకు సంబంధించి సీపీటీ సిలబస్‌లో మార్పులు చేస్తామన్నారు. అంతేకాకుండా ప్రొబేషనరీ ఖరారుకు ఎంపికైన వారికి డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ కూడా నిర్వహించే ప్రతిపాదన ఉందన్నారు.

TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?  

గ్రూప్‌–1 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండాలా వద్దా..?
గ్రూప్‌–1 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్నామని, తుది నిర్ణయమేదీ లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అత్యున్నత పోస్టులకు ఎంపికైన వారికి అందుకు తగ్గ సామర్థ్యాలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలంటే రాత పరీక్షలతో పాటు ఇతర రకాల పరీక్షలు కూడా ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోందన్నారు. యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాల కమిషన్లతో దీనిపై చర్చిస్తున్నామని తెలిపారు. కేరళలో ఇంతకుముందు జరిగిన వివిధ రాష్ట్రాల కమిషన్ల భేటీలో దీనిపై చర్చ జరిగిందని, వచ్చేనెల(ఆగ‌స్టు) 8వ తేదీన‌ విశాఖపట్నంలో ఆలిండియా కమిషన్ల సమావేశం ఉంటుందని అందులోనూ చర్చిస్తామని తెలిపారు. 

గ్రూప్స్‌ ప‌రీక్ష‌ల్లో నెగ్గాలంటే..ఇవి త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే..

ఈ అంశాలు కోర్టు పరిధిలో ఉన్నందున..
గ్రూప్‌–1పై ఇటీవల కొందరు అభ్యర్థులు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సవాంగ్‌ సమాధానమిస్తూ.. ఈ అంశాలు కోర్టు పరిధిలో ఉన్నందున బయటకు స్పందించలేమన్నారు. సంబంధిత అంశాలపై గవర్నర్‌ కార్యాలయానికి వివరణలు పంపించామన్నారు. తెలుగు మాధ్యమం అభ్యర్థులకు అన్యాయం జరిగిందనడం వాస్తవం కాదని, వీటిపై ఇంతకుమించి స్పందించలేమని పేర్కొన్నారు.అన్ని ఫైళ్లను కోర్టు ముందుంచామన్నారు. సమాధాన పత్రాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచడమనే విధానం ఏపీపీఎస్సీలో లేదని, యూపీఎస్సీలో కూడా లేదని వివరించారు.

పోటీ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

వయోపరిమితి సడలింపుపై..
కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి వయోపరిమితి సడలించాలని అభ్యర్థుల నుంచి వస్తున్న వినతిపై స్పందిస్తూ దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

ఏపీపీఎస్సీ భ‌ర్తీ చేయ‌నున్న గ్రూప్‌–1 పోస్టులు ఇవే..

విభాగం

పోస్టులు

డిప్యూటీ కలెక్టర్లు

10

రోడ్‌ ట్రాన్స్ పోర్టు ఆఫీసర్లు (ఆర్టీవో)

07

కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్లు (సీటీవో)

12

జిల్లా రిజిస్ట్రార్‌ (స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్లు)

06

జిల్లా గిరిజన సంక్షేమ అధికారి

01

జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి

01

జిల్లా బీసీ సంక్షేమ అధికారి

03

డీఎస్పీ (సివిల్‌)

13

డీఎస్పీ (జైళ్లు –పురుషులు)

02

జిల్లా అగ్రిమాపక అధికారి (డీఎఫ్‌వో)

02

అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌

03

మున్సిపల్‌ కమిషనర్‌

01

మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–2

08

డిప్యూటీ రిజిస్ట్రార్‌ (కోపరేటివ్‌ డిపార్ట్‌మెంట్‌)

02

లే సెక్రటరీ అండ్‌ ట్రెజరర్‌ గ్రేడ్‌–2

05

ఏటీవో/ఏఏవో (ట్రెజరీస్‌ డిపార్ట్‌మెంట్‌)

08

ఏఏవో (డీఎస్‌ఏ) (స్టేట్‌ ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌)

04

ఏవో (డైరెక్టర్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌)

15

ఎంపీడీవో

07

మొత్తం

110

ఏపీపీఎస్సీ భ‌ర్తీ చేయ‌నున్న గ్రూప్‌–2 పోస్టులు ఇవే..

విభాగం

పోస్టులు

డిప్యూటీ తహసీల్దార్‌

30

సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2

16

అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, కోపరేటివ్‌

15

మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3

05

ఏఎల్‌వో (లేబర్‌)

10

ఏఎస్‌వో (లా)

02

ఏఎస్‌వో (లేజిస్లేచర్‌)

04

ఏఎస్‌వో (సాధారణ పరిపాలన)

50

జూనియర్‌ అసిస్టెంట్స్‌ (సీసీఎస్‌)

05

సీనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ)

10

జూనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ)

20

సీనియర్‌ అడిటర్‌ (స్టేట్‌ ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌)

05

ఆడిటర్‌ (పే అండ్‌ అలవెన్స్ డిపార్ట్‌మెంట్‌)

10

మొత్తం

182

Group 2 Preparation Plan: గ్రూప్-2కు ఎలా ప్రిపరేషన్ అయితే.. విజ‌యం సాధించవ‌చ్చు?

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమినరీ..

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియలో ముందుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. తొలిదశగా నిర్వహించే ప్రిలిమినరీ పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో సాగుతుంది. ఇందులో నిర్దిష్ట కటాఫ్‌ మార్కుల జాబితాలో నిలిచిన వారికి రెండో దశలో మెయిన్‌ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్‌కు ఒక్కో పోస్ట్‌కు 50 మంది చొప్పున(1:50 నిష్పత్తిలో) ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. మెయిన్‌లో నిర్దేశిత మార్కులు పొందిన వారిని చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. పర్సనల్‌ ఇంటర్వ్యూ, మెయిన్‌ల్లో చూపిన ప్రతిభ ఆధారంగా తుది విజేతలను ఖరారు చేస్తారు.
ప్రిలిమ్స్‌.. రెండు పేపర్లు..

గ్రూప్‌–1 ఎంపిక ప్రక్రియలో తొలి దశగా పేర్కొనే ప్రిలిమ్స్‌ను రెండు పేపర్లుగా నిర్వహిస్తున్నారు. ప్రిలిమ్స్‌నే స్క్రీనింగ్‌ టెస్ట్‌గా పిలుస్తున్నారు. ప్రిలిమ్స్‌ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో.. మూడు గంటల వ్యవధిలో జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు..

పేపర్‌ సబ్జెక్ట్‌లు మార్కులు
1 ఎ) హిస్టరీ అండ్‌ కల్చర్‌
బి) రాజ్యాంగం, పాలిటీ, సోషల్‌ జస్టిస్, అంతర్జాతీయ సంబంధాలు
సి) భారత్, ఆంధ్రప్రదేశ్‌ ఎకానమీ
డి) జాగ్రఫీ 
120
2 జనరల్‌ అప్టిట్యూడ్‌ ఎ) జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ బి–1) సైన్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ బి–2) ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు 120

గ్రూప్‌–1 ఎంపిక ప్రక్రియలో రెండో దశ మెయిన్‌ ఎగ్జామినేషన్‌..

గ్రూప్‌–1 ఎంపిక ప్రక్రియలో రెండో దశ మెయిన్‌ ఎగ్జామినేషన్‌.ఇందులో ఏడు పేపర్లు ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ పేపర్లను అర్హత పేపర్లుగా నిర్దేశిస్తారు. ఈ పేపర్లలో కనీసం 40 శాతం(ఓసీ అభ్యర్థులు), (35 శాతం రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు) మార్కులు సాధిస్తేనే మెయిన్‌ మిగతా పేపర్ల మూల్యాంకన చేస్తారు. మెయిన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా.. ఖాళీలను అనుసరించి 1:2 నిష్పత్తిలో చివరి దశ పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్ష పేపర్ల వివరాలు..

పేపర్‌ సబ్జెక్ట్‌  మార్కులు
లాంగ్వేజ్‌ పేపర్‌ తెలుగు  150
లాంగ్వేజ్‌ పేపర్‌ ఇంగ్లిష్‌ 150
పేపర్‌–1 జనరల్‌ ఎస్సే (ప్రాంతీయ, జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న సమకాలీన అంశాలు) 150
పేపర్‌–2 హిస్టరీ భారత్, ఏపీ చరిత్ర సంస్కృతి, భౌగోళిక శాస్త్రం 150
పేపర్‌–3 పాలిటీ, రాజ్యాంగం, పాలన, లా, ఎథిక్స్‌ 150
పేపర్‌–4 ఎకానమీ, భారత దేశ, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి 150
పేపర్‌–5 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణ అంశాలు 150
మొత్తం మార్కులు   750

ప్రిపరేషన్‌కు కదలండిలా..

గ్రూప్‌–1 పోస్ట్‌ల సంఖ్య, వాటికి ఆమోదంపై స్పష్టత లభించింది. కాబట్టి త్వరలోనే ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. నోటిఫికేషన్‌ వచ్చే వరకు వేచి చూడకుండా.. ఇప్పటి నుంచే ప్రిపరేషన్‌ దిశగా అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

చదవండి: Indian Polity Notes for Group 1&2: భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టం 1992 వర్తించని రాష్ట్రం

సిలబస్‌ను..

ముందుగా అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్‌ సిలబస్‌ను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఆ తర్వాత ఆయా అంశాలకు కల్పిస్తున్న వెయిటేజీని గమనించాలి. దీనికి అనుగుణంగా ప్రిపరేషన్‌ సమయంలో ఆయా సబ్జెక్ట్‌లలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అంశాలను గుర్తించాలి. వాటి కోసం సమయం కేటాయించాలి.
 

కాన్సెప్ట్స్‌ + కరెంట్‌ ఈవెంట్స్‌..

ఆయా సిలబస్‌ అంశాలను చదివేటప్పుడు వాటిని సమకాలీన పరిణామాలతో సమన్వయం చేసుకోవాలి. డిస్క్రిప్టివ్‌ విధానంలో ప్రిపరేషన్‌ సాగించాలి. తద్వారా కోర్‌ సబ్జెక్ట్‌లపై పట్టుతోపాటు సమకాలీన పరిస్థితుల్లో అన్వయించే నైపుణ్యం కూడా లభిస్తుంది. ముఖ్యంగా గ్రూప్‌–1 అభ్యర్థులకు ఇది ఎంతో కలిసొచ్చే అంశంగా మారుతుంది.

విశ్లేషించుకుంటూ..

  • గ్రూప్‌–1 అభ్యర్థులు ప్రిలిమ్స్‌ నుంచే ఆయా అంశాలను విశ్లేషించుకుంటూ.. అభ్యసించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. సమకాలీన అంశాలపై పూర్తి స్థాయి అవగాహన, విశ్లేషణ, స్వీయ అభిప్రాయ దృక్పథం పెంచుకోవాలి. ముఖ్యమైన అంశాలకు సంబంధించి సినాప్సిస్, నేపథ్యం, ప్రభావం, ఫలితం, పర్యవసానాలు.. ఇలా అన్ని కోణాల్లో అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. ముఖ్యంగా నవరత్నాలు, అమలు చేస్తున్న పథకాలు, లక్షిత వర్గాలు, బడ్జెట్‌ కేటాయింపులు, ఇప్పటివరకు లబ్ధి పొందిన వారి సంఖ్య తదితర వివరాలను అవపోసన పట్టాలి. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో అమలవుతున్న ఆర్థిక విధానాలు, వాటిద్వారా కలిగిన అభివృద్ధిపైనా దృష్టి సారించాలి. 
  • గత రెండేళ్లుగా ప్రపంచాన్ని కుదిపేసిన కొవిడ్‌ పరిణామాల గురించి కూడా అధ్యయనం చేయాలి. వీటిని స్థానిక పరిస్థితులతో అన్వయం చేసుకుంటూ అభ్యసనం సాగించడం కూడా మేలు చేస్తుంది.అదే విధంగా జాతీయ స్థాయిలో తాజా రాజ్యాంగ సవరణలు, నూతన జాతీయ విద్యా విధానం, ఇటీవల కాలంలో కీలకమైన తీర్పుల గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలి.

Nikhila, IAS : ఇలా చదవితే.. గ్రూప్స్‌లో ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం..

మరవకుండా..

హిస్టరీ విషయంలో రాష్ట్ర చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. ప్రాచీన చరిత్ర మొదలు ఆధునిక చరిత్ర వరకూ.. ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించాలి. జాతీయోద్యమంలో ఆంధ్రప్రదేశ్‌ పాత్ర గురించి అధ్యయనం చేయాలి. ఇదే తీరులో భారత దేశ చరిత్రకు సంబంధించిన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. జాగ్రఫీకి సంబంధించి రాష్ట్రంలోని భౌగోళిక వనరులు, అడవులు, జీవ సంపద, వ్యవసాయ వనరుల గురించి తెలుసుకోవాలి. వీటిని తాజా పరిస్థితులతో అన్వయం చేసుకోవాలి. అదే విధంగా గత ఏడాది కాలంలో చేపట్టిన వ్యవసాయ, నీటి పారుదల ప్రాజెక్ట్‌లు.. వాటి ద్వారా లబ్ధి చేకూరే ప్రాంతాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

పాలిటీ పట్టు సాధించాలంటే..

ఈ సబ్జెక్ట్‌పై పట్టు సాధించాలంటే.. రాజనీతి శాస్త్రం, రాజ్యాంగానికి సంబంధించి ప్రాథమిక అంశాలు, భావనలు మొదలు తాజా పరిణామాలు(రాజ్యాంగ సవరణలు వాటి ప్రభావం) తెలుసుకోవాలి. గవర్నెన్స్, లా, ఎథిక్స్‌కు సంబంధించి సుపరిపాలన దిశగా చేపడుతున్న చర్యలు, పబ్లిక్‌ సర్వీస్‌లో పాటించాల్సిన విలువలు, ప్రజాసేవలో చూపించాల్సిన నిబద్ధత, అంకిత భావం వంటి విషయాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. వాస్తవానికి దీనికి సంబంధించి ప్రత్యేక పుస్తకాలు లేనప్పటికీ.. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పుస్తకాలు కొంత మేలు చేస్తాయి. వీటితోపాటు స్ఫూర్తిదాయక నేతల వివరాలు, వారు పాలించిన తీరు తదితర అంశాలను సేకరించుకోవాలి. న్యాయపరమైన అంశాలపైనా పట్టు సాధించాలి. ప్రాథమిక హక్కులు, విధులు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు.. వీటికి సంబంధించి న్యాయ వ్యవస్థకున్న అధికారాల గురించి తెలుసుకోవాలి. అదే విధంగా, సివిల్, క్రిమినల్‌ లా, కార్మిక చట్టాలు, సైబర్‌ చట్టాలు, ట్యాక్స్‌ లాస్‌ గురించి తెలుసుకోవాలి.

TSPSC & APPSC Groups Best Books: గ్రూప్స్‌కు ప్రిపేర‌య్యే అభ్యర్థులు ఈ పుస్తకాలను చ‌దివారంటే..

ఎకానమీ.. 

గ్రూప్‌–1 అభ్యర్థులు ఎకనామీకి విస్తృతంగా అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది. ప్రిపరేషన్‌ ప్రారంభ దశలో ఎకానమీకి సంబంధించి మౌలిక భావనలు మొదలు తాజా వృద్ధి రేట్ల వరకూ.. గణాంక సహిత సమాచారం సేకరించుకుని పరీక్షకు సన్నద్ధం కావాలి. ఇటీవల కాలంలో చేపట్టిన ప్రధాన ఆర్థిక సంస్కరణలు, వాటిద్వారా లబ్ధి చేకూరే వర్గాలు; జాతీయ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తాజాగా తీసుకొచ్చిన విధానాలపై పట్టు సాధించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు, ఎకనామిక్‌ సర్వేలపై అవగాహన పొందాలి.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ..

ఈ సబ్జెక్ట్‌కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమలవుతున్న కొత్త విధానాలు, ప్రధాన సంస్థలు, రాష్ట్ర స్థాయిలో ఐసీటీ విధానాలు, ఇండియన్‌ స్పేస్‌ ప్రోగ్రామ్, డీఆర్‌డీఓ, ఇంధన వనరులు, విపత్తు నిర్వహణకు అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. దీంతోపాటు పర్యావరణ సంబంధిత అంశాలపైనా దృష్టి సారించాలి. అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తున్న చట్టాలు, విధానాలపై అవగాహన పొందాలి.

 పునర్విభజన చట్టం..

గ్రూప్‌–1 అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన మరో కీలక అంశం.. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014. జనరల్‌ స్టడీస్,ఎకానమీ, హిస్టరీ పేపర్లు అన్నింటిలోనూ.. ఈ చట్టం నుంచి ప్రశ్నలు అడిగే అవకాశాలున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఈ చట్టాన్ని ప్రత్యేక దృష్టితో అభ్యసించాలి. విభజన తర్వాత ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు.. వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి సమకాలీన అంశాలతో కూడిన సమాచారంతో పరీక్ష సమయానికి సన్నద్ధత సాధించాలి.

గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రాధాన్యం..

ప్రభుత్వం నెలకొల్పిన గ్రామ, వార్డ్‌ సచివాలయ వ్యవస్థ గురించి కూడా పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. ఈ వ్యవస్థ ఉద్దేశం, లక్షిత వర్గాలు, ఇప్పటి వరకు ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు లభించిన ఫలితాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా జనరల్‌ ఎస్సే, లేదా పాలిటీ పేపర్లలో దీనికి సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి వార్డ్, గ్రామ సచివాలయాల ద్వారా అందుతున్న సేవలు, సిబ్బంది, లక్షిత వర్గాలు.. ఇలా అన్ని కోణాల్లో గణాంకాలతో కూడిన సమాచారాన్ని అవపోసన పట్టాలి. ఇలా.. ప్రిపరేషన్‌ తొలి దశ నుంచి ఆయా సబ్జెక్ట్‌ల వారీగా నిర్దిష్ట ప్రణాళికతో అడుగులు వేస్తే విజయావకాశాలు మెరుగవుతాయి.

Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!

గ్రూప్‌–1 ప్రిపరేషన్‌.. ముఖ్యాంశాలు..

ప్రిలిమ్స్‌ నుంచే మెయిన్స్‌ దృక్పథంలో డిస్క్రిప్టివ్‌ విధానంలో చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.

  • ఆయా అంశాలకు సంబంధించి భావనలు, ప్రాథమిక అంశాలను సమకాలీన అంశాలతో బేరీజు వేసుకుంటూ చదవాలి.
  • ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌ చదివే విధంగా సమయ పాలన రూపొందించుకోవాలి.
  • ప్రతి రోజు కనీసం ఎనిమిది నుంచి పది గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించేలా సన్నద్ధత పొందాలి.
  • ప్రిలిమ్స్, మెయిన్స్‌ అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదివితే.. మెయిన్స్‌ ప్రిపరేషన్‌ సమయంలో ఒత్తిడి నుంచి దూరంగా ఉండే అవకాశం.
  • ప్రిలిమ్స్‌కు నెల రోజుల ముందు నుంచి పూర్తిగా ప్రిలిమ్స్‌కే కేటాయించాలి.
  • ప్రిలిమ్స్‌ పూర్తయ్యాక 60 శాతం మార్కులు వస్తాయనే ధీమా ఉంటే వెంటనే మెయిన్స్‌కు ప్రిపరేషన్‌ మొదలు పెట్టాలి.
  • మెయిన్స్‌ ప్రిపరేషన్‌ సమయంలో రైటింగ్‌ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • మాక్‌ టెస్ట్‌లు, మోడల్‌ టెస్ట్‌లకు హాజరు కావాలి.

TSPSC& APPSC Groups: గ్రూప్స్‌లో గెలుపు బాట‌ కోసం.. ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల సూచ‌న‌లు- సలహాలు ..

#Tags