Group 2 Preparation Plan: గ్రూప్-2కు ఎలా ప్రిపరేషన్ అయితే.. విజయం సాధించవచ్చు?
ఇది ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి అభ్యర్థులు డిస్క్రిప్టివ్ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి. దీనివల్ల ఒక అంశాన్ని వివిధ కోణాల్లో అధ్యయనం చేసేందుకు వీలవుతుంది. ప్రశ్న ఏ విధంగా అడిగినా సమాధానం ఇవ్వగల సామర్థ్యం లభిస్తుంది. డిస్క్రిప్టివ్ తరహాలో ప్రిపరేషన్ సాగిస్తున్నప్పుడు అభ్యర్థులు ముఖ్యాంశాలను పాయింటర్స్‌లా లేదా షార్ట్ నోట్స్ రూపంలో రాసుకోవాలి. ఫలితంగా రివిజన్ చేసేటప్పుడు సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా సబ్జెక్ట్‌లకు సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ కొనసాగించడానికి వీలవుతుంది. ముఖ్యంగా ఎకానమీ, పాలిటీ సబ్జెక్ట్‌లలో షార్‌టకట్ నోట్స్ విధానం ఎంతో అవసరం.
కేవలం ప్రిపరేషన్‌కే పరిమితం కాకుండా..
అభ్యర్థులు కేవలం ప్రిపరేషన్‌కే పరిమితం కాకుండా, తాము అప్పటివరకు చదివిన అంశాలపై ఏ మేరకు పట్టు సాధించామనే దానిపై స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. దీనికోసం స్వయంగా మాక్ టెస్ట్‌లు రాయాలి. వాటిని మూల్యాంకనం చేసుకొని, ప్రిపరేషన్ పరంగా లోపాలను సరిదిద్దుకోవాలి. పేపర్ల వారీగా వారాంతపు పరీక్షలకు హాజరుకావడం విజయావకాశాలను మెరుగుపరుస్తుంది. వారం రోజుల్లో చదివిన అంశాలకు సంబంధించి టెస్ట్ రాయడం, ఫలితాలను విశ్లేషించుకోవడం చేయాలి. ఒక అంశాన్ని కేవలం థియరిటికల్ అప్రోచ్‌తో చదవడానికే పరిమితం కాకుండా.. ప్రాక్టీస్ చేయాలి.
గ్రూప్స్ పరీక్షల్లో నెగ్గాలంటే..ఇవి తప్పక చదవాల్సిందే..