TS High Court : గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై.. టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజ్‌పై టీఎస్ హైకోర్టులో ఆగస్టు 16వ తేదీన (బుధవారం) విచారణ జరిగింది.
దర్యాప్తు నివేదిక మూడు వారాల్లో సమర్పించాలని హైకోర్టు టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. పేపర్ లీకేజీపై సీబీఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. మరో కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను ఈ పిల్‌కు అటాచ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
TSPSC Group 2 & 3 New Exam Dates 2023 : గ్రూప్-2 & 3 కొత్త పరీక్ష తేదీలు ఇవే.. ఈ సారి మాత్రం..
#Tags