APPSC Group 1 Notification Released 2023 : గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఈ సిలబస్ ప్రకారమే పరీక్షలు.. మొత్తం ఎన్ని పోస్టులకంటే..?
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు నేడే మరో గుడ్‌న్యూస్ చెప్పినున్నది. డిసెంబర్ 7వ తేదీన(గురువారం) 897 ఉద్యోగాలకు గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే. కేవలం ఒక రోజు గడువులోనే నేడు డిసెంబర్ 8వ తేదీన(శుక్రవారం) ఏపీపీఎస్సీ దాదాపు 81 గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ సారి గ్రూప్-1 పరీక్షావిధానం.. సిలబస్‌లు మార్పులు చేర్పులు ఎలాంటివి ఉండవని.. పాత విధానంలో పరీక్షావిధానం ఉంటుందని ఏపీపీఎస్సీ తెలిపింది. మార్చి 17వ తేదీన 2024 గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించున్నారు. దరఖాస్తులు జనవరి 1వ తేదీ నుంచి జనవరి 21వ తేదీన వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సారి ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఇదే..
#Tags