Ration card Application : ఇంట్లో నుంచే..రేషన్ కార్డు అప్లికేషన్ స్టేటస్‌ను తెలుసుకోండి ఇలా..

మండల తహశీల్దార్ కార్యాలయంలో గతంలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు ఇప్పుడు వాటిని ఆమోదించారో లేదా అనేది ఎలా చూడాలో చాలామంది ప్రజలకి తెలియదు.
Ration card Application Status

సాదారణంగా మీ సేవలో దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు వాటిని అప్రూవ్ చేశారా లేదా అని మీ సేవ కేంద్రానికి వెళ్లి చూసుకుంటారు. కానీ,ఇక నుంచి మీకు ఆ అవసరం లేదు. మీరు దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ ఇంట్లో నుంచో తెలుసుకోవచ్చు. అదే ఏ విధంగానో ఇప్పుడు తెలుసుకుందాం..

1. మొదట మీరు ఈపిడీస్ తెలంగాణ( https://epds.telangana.gov.in/FoodSecurityAct/ ) పోర్టల్ ఓపెన్ చేయాలి.

2. ఇప్పుడు వెబ్ సైట్ ఓపెన్ చేశాక, ఎఫ్ ఎస్ సీ సర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. 
3.మీకు కనిపించే రేషన్ కార్డు సర్చ్ లో ఎఫ్ఎస్ సీ సర్చ్, ఎఫ్ఎస్ సీ అప్లికేషన్ సర్చ్ అనే రెండు కేటగిరీలు ఉంటాయి.

4.ఇందులో ఎఫ్ఎస్ సీ అప్లికేషన్ సర్చ్ అనే దానిమీద క్లిక్ చేయండి.

 5.ఇప్పుడు మీ జిల్లాను ఎంచుకొని, పక్కనే ఉన్న దానిలో మీ సేవ నెంబర్ (లేదా) మొబైల్ నెంబర్ (లేదా) అప్లికేషన్ నెంబర్ సహయంతో సర్చ్ చేయండి.

ఇప్పుడు మీ రేషన్ కార్డు దరఖాస్తును ఆమోదించారో లేదా అనేది మీకు తెలుస్తుంది.

Pan card Update: ఇంట్లో నుంచే..పాన్‌కార్డులోని పొరపాట్లను అప్‌డేట్‌ చేయండిలా..!

Pancard : మీ పాన్‌ కార్డ్‌ పోయిందా..! అయితే వెంటనే ఇలా చేయండి..!

Aadhar Card Address Change : ఆన్‌లైన్‌లోనే..ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోండిలా..

Aadhar card update : మీ ఇంట్లో నుంచే ఈ లింక్ ద్వారా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోండిలా..

#Tags