JNTUK in GATE Exam: గేట్‌-2024 పరీక్షలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు వీరే!

గతంలో గేట్‌ రాసేందుకు జేఎస్‌టీయూ నుంచి ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నప్పటికి అత్యుత్తమ ర్యాంకులను సాధించింది మాత్రం ఈ ఏడాది విద్యార్థులే. ఈసారి నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌ - 2024) లో వారి ప్రతిభ చాటి అత్యుత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులు వీరే..

బాలాజీచెరువు: అవకాశం వస్తే కార్పొరేట్‌ విద్యార్థుల కన్నా తామేమీ తక్కువ కాదని నిరూపించారు జేఎన్‌టీయూకే విద్యార్థులు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ తమ ప్రతిభకు ‘గేట్‌’ తెరిచారు. గత ఫిబ్రవరిలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బెంగళూరు నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌)–2024లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. వర్సిటీలో అనుభవజ్ఞులైన ప్రతి ప్రొఫెసర్‌కూ ఆయా విభాగాల సబ్జెక్టుల బోధనపై క్యాలెండర్‌ రూపొందించి, పక్కాగా అమలు చేశారు.

IIT Students: ఐఐటీ విద్యార్ధులకు దక్కని జాబ్‌ ఆఫర్లు.. కార‌ణం ఇదే..

దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని గేట్‌లో మంచి ర్యాంకులు సాధించారు. గత మూడేళ్ల కంటే అత్యుత్తమ ప్రతిభ చూపారు. ఈసీఈ విభాగానికి చెందిన యర్రు లక్ష్మీసాయికృష్ణ ఆలిండియా 10వ ర్యాంక్‌ సాధించాడు. సివిల్‌ విభాగం నుంచి 30 మంది, ఈఈఈ విభాగం నుంచి 65, సీఎస్‌ఈ నుంచి 25, కెమికల్‌ విభాగం నుంచి 8, పెట్రోలియం ఇంజనీరింగ్‌ నుంచి 6 చొప్పున విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. కోవిడ్‌ కారణంగా 2021లో విద్యార్థులకు రెగ్యులర్‌ తరగతులు లేకపోవడంతో ఉన్నత విద్యామండలి ఆ ఏడాది ఆన్‌లైన్‌లో గేట్‌ తరగతులు నిర్వహించగా, 21 మంది విద్యార్థులు వెయ్యిలోపు ర్యాంకులు సాధించారు.

Model School Exam: మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు పరీక్ష తేదీ ఇదే..

2022లో 38 మంది, 2023లో 45 మంది ర్యాంకులు సాధించగా.. ఈ ఏడాది 189 మంది విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి, విజయబావుటా ఎగురవేశారు. గేట్‌లో ర్యాంకులు సాధించిన వారికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆయా విద్యా సంస్థల్లో ఎంటెక్‌ చదివే వారికి ప్రతి నెలా రూ.12,400 చొప్పున ఉపకార వేతనం అందిస్తారు.

మంచి ర్యాంకులు సాధిస్తున్నారు

ఇంజినీరింగ్‌ పూర్తి చేస్తున్న విద్యార్థులకు కీలకంగా ఉన్న గేట్‌ పరీక్షలో మా విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉంది. గేట్‌ శిక్షణ తరగతులను ప్రతి విద్యార్థీ సద్వినియోగం చేసుకుని, మంచి ర్యాంకులు సాధించి, వర్సిటీ ప్రతిష్ట నిలిపారు. గేట్‌ స్కోర్‌ ఆధారంగా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలతో పాటు ఆసియా దేశాల్లో ఎంఎస్‌, పీహెచ్‌డీ చేయవచ్చు. ఈ ర్యాంకు ఆధారంగా సింగపూర్‌లోని ప్రముఖ వర్సిటీలు సీట్లు ఇస్తున్నాయి.

– డాక్టర్‌ జీవీఆర్‌ ప్రసాద్‌రాజు, ఉప కులపతి, జేఎన్‌టీయూకే

CBSE Brings Changes In Exam Format: 11, 12 తరగతి పరీక్షల తీరులో సీబీఎస్‌ఈ కీలక మార్పులు.. కొత్త ఫార్మాట్‌లో ప్రశ్నలు

ఐఐటీలో ఎంటెక్‌ చదువుతా..

గేట్‌లో 10వ ర్యాంక్‌ రావడం చాలా సంతోషంగా ఉంది. బీటెక్‌లో 9.32 పాయింట్లతో ఉత్తీర్ణత సాధించి గేట్‌ పరీక్షకు సిద్ధమయ్యాను. ఐఐటీ ముంబైలో ఎంటెక్‌ తరువాత సెమీ కండక్టర్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో ఉన్నత స్థాయికి చేరడమే నా లక్ష్యం.

– వై.లక్ష్మీసాయికృష్ణ, గేట్‌ 10వ ర్యాంకర్‌

సెకండియర్‌ నుంచే అవగాహన

ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం నుంచే గేట్‌ పరీక్షపై అవగాహన కల్పిస్తాం. పాత పేపర్ల రివిజన్‌తో పాటు ప్రత్యేకంగా బోధిస్తాం. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి, ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల స్థాయిని మరింత పెంచారు. ఈ ఏడాది మరింత ప్రతిభ చూపడం సంతోషంగా ఉంది.

– డాక్టర్‌ కృష్ణప్రసాద్‌, ప్రిన్సిపాల్‌, జేఎన్‌టీయూకే

AP Intermediate Results: ముగిసిన ఏపీ ఇంటర్‌ మూల్యాంకనం.. ఫలితాల తేదీ..?

పరిశోధన రంగంపై ఆసక్తి

ఆలిండియా స్థాయి ఓపెన్‌ కేటగిరిలో 118వ ర్యాంక్‌ సాధించడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం కేంద్ర పరిశోధన సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. ఎంటెక్‌ చదివి పరిశోధన రంగంలో అగ్రస్థానంలో నిలవడమే నా ఆశయం.

– మీసాల సాయి దుర్గా కౌశిక్‌, 118వ ర్యాంక్‌

Polytechnic Courses: పాలిటెక్నిక్‌ కోర్సులతో ఉపాధి అవకాశాలు..

#Tags