AP Intermediate Results: ముగిసిన ఏపీ ఇంటర్ మూల్యాంకనం.. ఫలితాల తేదీ..?
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షల మూల్యాంకనం గురువారంతో ముగిసింది. ఈ ప్రక్రియ గత 18న మొదలు కాగా.. అదే నెల 31వ తేదీకి ముగియాల్సి ఉంది. అయితే ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు మూల్యాంకన కార్యక్రమానికి హాజరు కాలేదు. షోకాజ్ నోటీసులు ఇచ్చినా స్పందించలేదు.
DSC Free Training: డీఎస్‌సీ ఉచిత శిక్షణకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..!
ఆయా కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడి అధ్యాపకులను బాధ్యతలు అప్పగించడంతో నాలుగు రోజులు ఆలస్యంగా మూల్యాంకనం పూర్తయ్యింది. చివరి రోజున ఫిజిక్స్ 2,356, గణితం 2,400, కెమిస్ట్రీ సబ్జెక్టుకు సంబంధించి 2,110 సమాధాన పత్రాలను మూల్యాంకనం చేశారు. పరీక్ష ఫలితాలు ఈ నెల 12వ తేదీలోపు విడుదల చేసేందుకు బోర్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
Lok Sabha Elections 2024: ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. ఎంత డబ్బు కావాలో తెలుసా..?