DSC Free Training: డీఎస్‌సీ ఉచిత శిక్షణకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..!
కరీంనగర్: కరీంనగర్ జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ కులాల విద్యార్థినీవిద్యార్థులకు రెండు నెలల కాలానికి డీఎస్సీ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ పి.నతానియేలు ఒక ప్రకటనలో తెలిపారు. భోజన వసతితో కూడిన రెసిడెన్షియల్ కోచింగ్ ఉంటుందన్నారు. జిల్లాకు చెందిన ఎస్సీ అర్హత కలిగిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులు ఈనెల 7 లోపు అంబేడ్కర్ భవన్‌లోని టీఎస్ స్టడీ సర్కిల్‌లో ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్స్ జిరాక్స్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు.
ఏదైనా టెట్, బీఈడీ, డైట్, టీటీసీ ఉతీర్ణులై ఉండాలని తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, డిగ్రీ మార్కుల మెమో, బీఈడీ, టెట్, టీటీసీ, డైట్, ప్రొవిజనల్, కులం, ఆదాయం సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, రెండు పాసుపోర్టు సైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 9885218053, 9573401227, 9177605511 నంబర్లను సంప్రదించాలని వివరించారు.
Tags
- Free training
- DSC candidates
- two months
- scheduled caste students
- Applications
- deadline for registrations
- ts dsc news
- Department of School Education
- entrance exam for dsc candidates
- Education News
- Sakshi Education News
- karimnagar news
- Karimnagar
- DeputyDirector
- Applications
- EligibleCandidates
- InterestedCandidates
- ApplyNow
- Announcement
- FreeTraining