Students for JEE Mains: ప్రశాంతంగా సాగిన తొలిరోజు జేఈఈ మెయిన్స్ పరీక్ష.. విద్యార్థుల హాజరు సంఖ్య ఇంత..!
Sakshi Education
నిన్న ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ పరీక్షలు సాఫీగా సాగాయి. అయితే, పరీక్ష కేంద్రంల్లో హాజరైన గైర్హాజరైన విద్యార్థుల సంఖ్యను సిటీ కో-ఆర్డినేటర్ తెలిపారు..
తిమ్మాపూర్: మండలంలోని వాగేశ్వరి కళాశాలలో జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. కళాశాల అయాన్ డిజిటల్ సెంటర్‌లో ఈ నెల 12వ తేదీ వరకు, ప్రతీరోజు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయని సిటీ కో–ఆర్డినేటర్ లలితకుమారి తెలిపారు.
విద్యార్థులను గంటన్నర ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతించామన్నారు. తొలిరోజు ఉదయం 676 మందికి 598 మంది, సాయంత్రం 676 మందికి 610 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రం వద్ద ఎల్‌ఎండీ ఎస్సై చేరాలు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
Diploma Courses: ఉర్దూ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సులు.. ఇదే దరఖాస్తులకు చివరి తేదీ..!
Published date : 05 Apr 2024 11:46AM
Tags
- JEE Mains
- Entrance Exam
- Intermediate Students
- exam centers
- first day exam
- Students Attendance
- Vageswari College
- City Co Ordinator Lalitha Kumari
- students education
- Education News
- Sakshi Education News
- karimnagar news
- Second phase exams
- JEE Mains
- Wageshwari College
- Absent students
- examination centers
- Sakshi Education Updates