Polytechnic Courses: పాలిటెక్నిక్ కోర్సులతో ఉపాధి అవకాశాలు..
నంద్యాల: పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. పదవ తరగతి విద్యార్హతతో సాంకేతిక విద్యకు పునాది వేసే ‘పాలిసెట్’కు ఫిబ్రవరి 20న నోటిఫికేషన్ విడుదలైంది.
Lok Sabha Elections 2024: ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. ఎంత డబ్బు కావాలో తెలుసా..?
ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు లభిస్తాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగియనుండటంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారుంటే త్వరపడాలని ప్రిన్సిపాల్ సూచించారు. ఇప్పటికే జిల్లాలో 3 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
పరీక్ష ఇలా..
పాలిసెట్ ఎంట్రెన్స్ పదో తరగతి సిలబస్ ఆధారంగా గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 చొప్పున మొత్తం 120 మార్కులకు ఉంటుంది. ప్రవేశ పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.400 చెల్లించాల్సి ఉంది.
DSC Free Training: డీఎస్‌సీ ఉచిత శిక్షణకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..!
పరీక్షకు సంబంధించిన తేదీలు ఇలా..
● పాలిసెట్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 5
● ప్రవేశ పరీక్ష తేదీ ఏప్రిల్ 27
● ఫలితాల వెల్లడి మే 25
● కౌన్సెలింగ్ ప్రారంభం జూన్ 4వ వారం
Water Break: పాఠశాలల్లో నీటి విరామం అమలు..
ఉద్యోగ అవకాశాలు ఎక్కువ
పాలిటెక్నిక్‌లో ఏ కోర్సు పూర్తి చేసినా ఉద్యోగం, ఉపాధి సులభంగా దొరుకుతుంది. కళాశాలల్లో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. పాలిటెక్నిక్ కోర్సు చేయడానికి సుమారు మూడేళ్ల సమయం, కేవలం రూ.13 వేల వరకు మాత్రమే ఫీజు వగైరాల ద్వారా వ్యయం అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ చేయాలనుకునే వారు అందులో చేరవచ్చు.
– శ్రీనివాసప్రసాద్, ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, నంద్యాల