TS CPGET 2023: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): రాష్ట్రంలోని వర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్ (రిజిస్ట్రేషన్) షెడ్యూల్‌ను ఆగస్టు 29న విడుదల చేశారు.
టీఎస్‌సీపీఈటీ–2023 అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 5 నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, 19న సర్టిఫికెట్ వెరిఫికేషన్స్, 20 నుంచి 22 వరకు వెబ్‌ఆప్షన్స్, 23న వెబ్ ఆప్షన్ ఎడిటింగ్, 26న సీట్లు పొందిన విద్యార్థుల మొదటి జాబితా విడుదల, 29న సీట్లు సాధించిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 1న రెండో విడత కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నట్లు కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు.
చదవండి:
Free Training : నిరుద్యోగులకు ఉచిత ఉపాధి శిక్షణ
Telangana: వివిధ చట్టాలపై విద్యర్థులకు పోలీస్‌శాఖ ఇచ్చిన అవగాహన
#Tags