Telangana: వివిధ చట్టాలపై విద్యర్థులకు పోలీస్‌శాఖ ఇచ్చిన అవగాహన
సాక్షి ఎడ్యుకేషన్: చదువుని మించిన ఆస్తి మరేదీ లేదని తాము ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పైకొచ్చామని జైపూర్ ఏసీపీ మోహన్ తెలిపారు. జైపూర్ మండల కేంద్రంలోని కస్తూరిబాగాంధీ విద్యాలయంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ట్రాఫిక్‌రూల్స్, షీటీం, మహిళల భద్రత చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
ఏసీపీ మోహన్, సీఐ రమేశ్, ఎస్సై ఉపేందర్‌రావు తమ విద్యాభ్యాసం, ఉద్యోగం సాధించిన తీరు, తల్లిదండ్రుల ఆశయాలను నేరవేర్చేందుకు చేయాల్సిన కృషిని వివరించారు. చదువు ను కష్టంగా కాకుండా ఇష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చన్నారు. లక్ష్యాన్ని ఏర్పర్చుకుని దానిని సాధించేందుకు నిరంతరం కష్టపడాలని సూచించారు. ఇటీవల సైబర్ నేరాలు పెరిగాయని లాటరీ పేరుతో ఫోన్‌కు మెసేజ్‌లు పంపి డబ్బులు ఆశ చూసి అకౌంట్లో డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులకు జాగ్రత్తలు చెప్పాలన్నారు. ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవడంతోపాటు కుటుంబ సభ్యుల భద్రతపై తల్లిదండ్రులకు సూచనలు చేయాలన్నారు.
Telangana: పంతులమ్మగా మారిన కలెక్టరమ్మ... కారణం?
Andhra Pradesh: ఏయూ చేసుకున్న ఒప్పందం...ఎవరితో?
అనంతరం విద్యార్థినులు పోలీస్ అధికారులకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీరాంపూర్ సీఐ రమేశ్, ఎస్సై ఉపేందర్‌రావు, కస్తూరిబాగాంధీ విద్యాలయ ప్రత్యేక అధికారి ఫణిబాల, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.